Tuesday 17 February 2009

అన్వేషణ 

నిరంతరం మన మనిషికై......
ఒక వెదుకులాట ప్రేమ. 

( సౌoదర్యాన్వేషణ......ప్రేమలో భాగం)

స్వార్ధం లేని ..........ఒక ఆప్యాయత కోసం.......

తల్లి పాలలోని స్వచ్చత కోసం.......అన్వేషణ  ప్రేమ!

సౌందర్యం వున్న ప్రతి చోటా------
కలువపువ్వు మెరిసిన  ప్రతీ----కొలనులో----
ప్రేమకై వెదుకులాట-----నక్షత్రాల వెలుగుతో!

సృష్టి కి కృతజ్ఞత ----స్త్రీ ని సృష్టించి నందుకు ,
నాకోసం సృష్టించిన స్త్రీ ఎవరు ?  ఆ వెదుకులాటే ------ప్రేమ!

(స్వార్ధం ముసుగులో.....కపటత్వం ముసుగులో ప్రేమ కనపడదు, ఆ ముసుగు ఎటువైపు వున్నా సరే !)

కాని వజ్రాల వెలుగుతో ప్రేమకై అన్వేషణ కొనసాగించాల్సిందే,
 (అర్హత సాధించాల్సిందే , స్త్రీ, పురుషులిద్దరూ )
(అది ఒక జీవిత కాల అన్వేషణ. కొందరి జీవితమే ధన్యం )
                  -------   శ్రీనివాస రాజు .పి 
                                          17-02-2013
                                   Cell No :- 0091 810 6871 802
                                     E -mail :- hellopsraju@gmail.com 
ప్రేమ 

"రెండు చిరునవ్వుల మధ్య  
 వెలుగును నింపే---
  "అమృతం"  ---  ప్రేమ "

                                         శ్రీనివాస రాజు.పి 
                          ------17-02-2013
                     Cell No : 810 6871 802
              E-Mail :- hellopsraju@gmail.com 


"రెండు శ్వాసల మధ్య 
ఒక ఆశను నింపే-- అభిమానం --  ప్రేమ "

                                   ------       శ్రీనివాస రాజు.పి , 
                                17-02-2013
నువ్వు 

"రెండు అనంతాల మద్య
 అద్భుతాన్ని చూసే--
 అదృష్టానివి ---- నువ్వు"

(నువ్వు పుట్టడానికి ముందు అనంతమైన కాలం గడిచింది. నీ మరణం తర్వాత కూడా..... అనంతమైన కాలం గడుస్తుంది.  ఈ మద్యలో క్షణకాలం అదృష్టమే నువ్వు మరియు నీ జీవితకాలం...! అందుకే జీవితాన్ని ప్రేమమయం, అనురాగమయం, దయామయం....చేసుకుని.....ప్రకృతి మీద ప్రేమతో....,నిజాయతితో....., క్రమశిక్షణతో ..., మంచి పనులు నేర్చుకునే ఒక  గొప్ప అభ్యాసంతో----,మంచి స్త్రీల పట్ల గౌరవంతో , ఆరాధనతో ..., కృతజ్ఞతతో.....,మెలుగుతూ, "సొంత లాభం కొంత మానుకుని--పోరుగువాడికి తోడుపడవోయి" అన్న గురజాడ మాటల్లో.....ఆ -పోరుగువాడు మనిషే కానక్కరలేదు, ఈ భూమిపై ఏ జీవరాశి ఐనా కావొచ్చు. నిజమైన అవసరంలో వున్న  మనిషి కావొచ్చు. లేదా, నరికే ఒక చెట్టుని రక్షించవచ్చు. "యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేన....." వేరే జీవరాశి existence ని కాపాడవచ్చు. దానికి అవసరం ఐన .....ప్రపంచం సృష్టించే....ground కోసం ఒక Action Plan నీ జీవితాశయం కావొచ్చు. (ఇంట్లో కుక్కలను.....పప్పిలుగా ప్రేమిస్తూ---స్వార్ధంతో జీవించే......వింత మనుషుల్లో మీరు భాగస్వాములు అవుతారా-? ఆలోచించుకోండి!?) జీవితం  అంటే ఒక సాధన. ఒక అభ్యాసం. ఒక ప్రేమ . ఒక అనుభూతి. ఒక ఆస్వాధన. ఒక చిరునవ్వు వెలుగు. ఒక నిజాయతి. ఒక కరుణ, దయ. ఒక వెన్నెల రాత్రి.....Make it more Fruitful)
                                                    ----శ్రీనివాస రాజు .పి 
                                                            17-02-2013
                                                E -Mail :- hellopsraju@gmail .com