Wednesday 21 March 2012

సౌందర్య భరితం 
(ది జాయ్ ఆఫ్ లివింగ్ బ్యుటిఫుల్లీ.....)


మాయ కదా ?!
నీ ఇష్టంతో , నీ అనుమతితో నిమిత్తం లేకుండా, 
నీకు ఏర్పడిన , "నీ ఈ " రూపం !?

మాయ కదా నీ ఇష్టంతో నిమిత్తం లేకుండా 
నీకు ఏర్పడిన నీ "జీవితకాలం" ?!
( Why only 120 years for humanbeings life span?, why it wouldn't be 1020 years, including 1000 years only with young and dynamic period YANI?)

అయ్యో మాయ కదా !
నీ ఇష్టంతో నిమిత్తం లేకుండా 
నీవు పురుషుడుగానో , లేదా స్త్రీ గానో జన్మించడం?!

నీలోని సౌందర్యం
నీ అపురూపమైన భావోద్వేగాలు 
నీ మనోలావన్యం-----
విశ్వసౌందర్యంలో భాగమైన నీ కళ్ళల్లోని మెరుపు...
మాయ కదా?-

అర్ధరాత్రి కలల్లో --
సృష్టి  రహస్యాన్నే ప్రశ్నించే ఆ దిక్కారస్వరాలు --------    
స్త్రీ , పురుష ఆకర్షణ -
నీవు ఆమెలో అంతర్భాగమౌతున్నపుడు 
ఆ మమేమకపు మైమరపు , జ్వలించే ఆ మెరుపు 
వ్యక్తం చేయలేము గాని , మాయే కదా!?
( "Words fail to express boundless joy and deep sorrow and beyond ecstasy")

నీ పుట్టుకకు ముందు నీవు ఎక్కడ వున్నావో నీకు తెలీదు ,
మరి మరణం తర్వాత కధ గురించి భయమెందుకు ?
అంతా  మాయలో భాగమైనపుడు?!

కాలం  కదలికకు నీ అనుమతి అవసరం లేనప్పుడు-
("Inevitable just like our death" )
నక్షత్రాల వెనుక అనంతత్వ రహస్యం , చీకటి నిగూఢత,.
నీ శైశవ , యవ్వన , కౌమార , ముసలితన రహస్యం .......
ఎన్నో రహస్యాలు.......
( Unbelievable  what kind of relation we are having with this Universe?! But one thing is sure, we are also an integral(offcourse a small and beautiful) part of this incredible Universe)
--------
ఇంత మాయలోనూ-----
నీ ప్రియనేస్తం తో 
హృదయ సంబంధం ఏర్పడడం గొప్ప విషయం!
ఇది గొప్ప జీవితం !
హృదయంతో ప్రేమించడం (ఆ ప్రేమ రక్తంలో ప్రవహించాలి సుమా!)
మామూలు మలినమైన విషయాలు , ప్రేమపై ముసరకుండా చూసుకోవడం,
జీవితాన్ని సౌందర్యవంతం చేసుకోవడం మనచేతుల్లోనే వుంది సుమా !
ఎపుడూ "మూడో వ్యక్తికి " చోటివ్వవద్దు. 

చిన్న రహస్యం - అర్ధం చేసుకుంటే - జీవితం అర్థవంతం - సౌందర్యభరితం !
సౌందర్యభరితం! అంత నీ చేతుల్లోనే !

                                          -----శ్రీనివాసరాజు .పి
                                         ----- 24 -06 -2004 

                                       (సెల్ no :- 810  6871  802 )
  














"anni janmala tarvata"...a great philosophical poem.

అన్ని జన్మల తర్వాత.........


మెరిసే గులాబీలు,
మాట్లాడే మల్లెపూలు 
పారే సెలయేరు, 
వీచే చల్లగాలి.......

అందం జీవితం, ఆనందం ప్రవాహం -
లక్షణాలుగా గల లక్ష సౌందర్య ప్రతిరూపాలు .....
-------
వాటి జీవిత కాలాలు - ఒక్క రోజో, ఒక్క పూటో, లేదా ఒక్క రాత్రో....
-------
లోకం మీదకు సౌందర్యాన్ని వెదజల్లి రాత్రికి 
రాలిపోయిన ఎర్రగులాబీ ......
రాత్రంతా సృష్టి సౌందర్యానికి , వేడి నిట్టూర్పులకు సాక్షులుగా మిగిలి
ఇంకా పరిమళంతోనే ఒక్క రాత్రికే ధన్యతతో అమరత్వాన్ని పొందుతున్న మల్లెపూలు.....
ఇలా లోక కళ్యాణం కోసం ,
ప్రకృతి సౌందర్యానికి తమ వంతు నగిషీలు చెక్కడంలో...
ఈ అందమైన, ఆనందాన్ని పంచే,
కర్తవ్య నిర్వహణలో నూటికి నూరుశాతం జీవిస్తున్న .......
ఎన్నో వెలుగులు, మెరుపులు , మరణం తర్వాత......
సృష్టికర్త  పాదాలను స్పృశిస్తున్నాయి ,
సృష్టికర్త  పాదాలను స్పృశిస్తున్నాయి !
గుండెను పిండేసే బాధతో ప్రశ్నిస్తున్నాయి !
"ఏమిటి మా జీవితం?
అందం, ఆనందం మేం అందిస్తున్నాం సరే!
కాని ఈ లోక సౌందర్యాన్ని, ఈ ఆనందాన్ని ----
మేం అనుభవించేది ఎప్పుడు అని !
ఆ అవకాశం, అదృష్టం, అర్హత మాకు ఎందుకు ప్రసాదించడం లేదు?
మేం చేసిన పాపం ఏమిటి ?" అని 

ఈ అనంత కాల ప్రవాహంలో ,
కనీసం ఒక్కసారైనా లోక సౌందర్యాన్ని ఆనందించే,
తనివితీరా ఆస్వాదించే అదృష్టం తమకు కల్పించమని!
ఆ జన్మ జన్మల  వేదన -కడుపు తరుక్కుపోయే విషాదం....
ఆ జన్మ జన్మల  వేదన -కడుపు తరుక్కుపోయే విషాదం....

సృష్టికర్త వింటున్నాడు, ......వింటున్నాడు .......
ఇలా -------
కోట్ల సంవత్సరాలు గడిచాయి , కోటాను కోట్ల సంవత్సరాలు గడిచాయి !
వేదనా తరంగాల ఘోష ప్రవహిస్తూనే వుంది.
------
ఆ వెలుగులు, మెరుపులు,  (ఇక లాభం లేదు అనుకొని)
నవ్వుల పువ్వుల రారాజు గులాబీని,
తమందరి ప్రతినిధిగా, తమ తరపున ....
తమ జీవితాల గురించి సంభాషించడానికి .....
సృస్తికర్త దగ్గరకు పంపాయి 
ఈ సంభాషణ, చర్చలు .......
ఇంకో కోటి సంవత్సరాలు జరిగాయి !
సృష్టికర్త అశ్రద్ద , బిజీ .....(ఆయన పనులు ఆయనకు వుంటాయి కదా మరి )
లేదా ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలీదా?!!
అనే ...............................................................
ఇలా కొన్ని యుగాలు గడిచాయి.
అప్పటికింకా మానవజాతి పుట్టలేదు .
----------
అన్ని యుగాల తర్వాత 
సృష్టికర్త జాలిపడడం , ఆయనకు పై విషయం న్యాయం అనిపించడం ......
క్షణంలో కోటో వంతులో అన్నీఆలోచించడం జరిగాయి .
ఏ ముహూర్తం ఐనా , అది గొప్ప ముహూర్తం !!

విశ్వసృస్టిలో ఓ అద్భుతం జరగబోతోంది ,
కోట్ల నక్షత్రాలన్నీ ఆత్రుతతో ,
తమ కాంతిని సృష్టికర్త లలాటంపై నిలిపాయి !
మహాసముద్రాలు తమ ప్రళయ భీభత్సాన్ని ఒక్క క్షణం అపాయి !     

సరే ఇన్ని జన్మల తర్వాత , ఇన్ని జన్మల తర్వాత.....
అని లెక్క చెప్పాడు.
----------
చెట్టుగా ఇన్నాళ్ళు, 
చీమగా ఇన్నాళ్ళు, 
రామచిలుకగా ఇన్నాళ్ళు ,
సాలెపురుగుగా ఇన్నాళ్ళు, 
గువ్వపిట్టగా  ఇన్నాళ్ళు, 
సముద్ర జీవిగా ఇన్నాళ్ళు,
సరీశ్రూపంగా ఇన్నాళ్ళు,
కదిలే మేఘంగా ఇన్నాళ్ళు,
మెరిసే మెరుపుగా ఇన్నాళ్ళు,
వేచే గాలిగా ఇన్నాళ్ళు....... 
......................................
శతసహస్ర జన్మలు ...............
---------------
"ప్రతిజన్మలోనూ  మీ కర్తవ్యాన్ని మీరు
సవ్యంగా , సమగ్రంగా నిర్వర్తించాలి సుమా"....
అని హెచ్చరికలూ జారీ చేసాడు.
ఇన్నాళ్ళ , ఇన్నేళ్ళ మీ ఎదురుచూపులు తర్వాత......
నేను త్వరలో సృష్టించబోయే మానవజాతిలో ,
మిమ్మలను "స్త్రీ" లుగా పుట్టించబోతున్నాను అని 
శుభవార్తను వాటి చెవిలో చెప్పాడు.
......."మధుమధురే మధుకైటభభంజని కైటభభంజని రాసరతే" -
......."శిఖరి శిరోమణి తుంగహిమాలయ శృంగనిజాలయ మధ్యగతే" -
......."త్రిభువనపోషిని శంకరతోషిని కిల్భిషమోషిని ఘోషరతే"- 
......."నిజభుజదండనిపాతితఖండవిపాతితముండభటాధిపతే"--

అన్ని కోట్ల సంవత్సరాలు నిరీక్షన ఫలించిది! ...........జన్మ ధన్యం-మహద్భాగ్యం 
అని కృతజ్ఞతలు.............చెప్పాయి సౌదర్య సుందరపుష్పాలన్నీ సృష్టికర్తకు,..ఆనందభాష్పాలతో ...,
స్త్రీ జన్మమీద ప్రేమతో .......
-----------
ఆ ధన్యత కోసం , అవి ప్రతిజన్మలోనూ తపస్సు చేస్తున్నాయి,
అవే కాదు ఇంకా ఎన్నో  సౌందర్య ప్రకృతిప్రతిరూపాలెన్నో స్త్రీ జన్మ కోసం తపస్సు చేస్తున్నాయి!!!    
అందుకే -------
శ్రద్దగా గమనించండి, చెరువు పక్క, చేను పక్క,
రహదారి పక్క , "స్త్రీ" జన్మ కోసం...... "స్త్రీ" జన్మ కోసం .....
"చెట్టు", అవును చెట్టు చేసే, మహావృక్షాలు చేసే ధర్మ తపస్సు మీకు కన్పిస్తుంది!
---------
అంత అద్భుతమైన "స్త్రీ" గా పుట్టడం కోసం ........
ఇంత అద్భుతమైన  "స్త్రీ"గా పుట్టిన మీరు .........??!!

                                      -శ్రీనివాసరాజు.పి
                                       05 -04 -2007 
                                                                                           
                                                                                  (cell No :- 810 6871 802)



















 





















One parameter of my Poetry.....

నా కవిత్వం.... 





ఈ అనంతాన్ని చూస్తూ మెరిసే నా  కళ్ళు ....
ఆ కళ్ళ కౌగిలికి చిక్కిన,.....చిక్కకుండా తప్పించుకుని ......జారిపడిన 
కొన్ని పాదరసం చుక్కలను.......
"కాలం అనే అద్భుత స్త్రీ", ఆ సౌందర్య రాసి చెక్కిలిపై ......
  (ఆహార్యంగా.....,),అందమైన మెరిసే నక్షత్రాలుగా తీర్చిదిద్దాలనే .....
ఒక తీవ్రమైన కాంక్షే .....నా కవిత్వం.
                                  ----- శ్రీనివాసరాజు.పి
                                   -----04 -08 -2011       


(నా కవిత్వం లో నేను కనిపిస్తాను. నన్ను అర్ధం చేసుకోవాలనుకునే  వారికి, .....నా మనసు కొంతవరకు మీకు అక్కడ కనిపిస్తుంది. )

Tuesday 20 March 2012

River "Akanda Godavari" & "Konaseema..."

నది గోదావరి 

నది గోదావరి నీటి ప్రవాహంతో ముందుకు సాగుతూ
మామూలు మనిషిని సైతం "ముని" మనసుతో 
తనవైపుకు చూడమంటుంది.

కోనసీమ...

కోనసీమ కొబ్బరి చెట్ల నడుమ 
చిన్న పిల్ల కాలువ సైతం 
మీకు గత జన్మరహస్యాలను  జ్ఞప్తికి తెప్పిస్తుంది. 

శ్రీనివాసరాజు .పి
(రాసిన  టైం , 1996  & 1998  మద్యలో ) 

"Yuvatee" this is my favourite poem. Very small age I wrote this poem. That pure innocence, serenity,...and explicit expression...,so my favourite....

యువతీ ....! 

యువతీ !
ఓ నా ప్రియమైన కలలమైత్రీ 
అర్ధరాత్రి అకస్మాత్తుగా నీ జ్ఞాపకం నన్ను కలవరపెడుతుంది!
అనుకోని నీ ఊహ నాలో 'రెప రెప ' లాడుతుంది !
నా ఆలోచన ఏ సమస్యావలయంలో  పరిభ్రమిస్తున్నా సరే----
నీ అందమైన రూపం నా వేడిమనస్సుపై చల్లటి పన్నీటి జల్లుని కురిపిస్తుంది !

యువతీ !
ఓ నా ప్రియమైన కలలమైత్రీ ---
'జీవితం' ఎంత గొప్పది అన్న స్పృహ నాలో,
నీ కళ్ళ లోతులను చూస్తున్నప్పుడు మాత్రమే-----
ఆ స్పృహ జీవంతో, సజీవంతో కదుల్తుంది సుమా!

యువతీ !
ఓ నా ప్రియమైన ఆలోచనల మైత్రీ -
నీ అందం , ఔన్నత్యమే ---
నన్ను జీవంతో, నవతెజంతో-ప్రేరేపిస్తూ--
ముందుకు కదిలిస్తోంది అన్న నేటి నా 'బలహీనత' నీకు తెలుసా?
ఎలా బంధీ అయ్యాను నీకు అంటే సమాధానం నావద్ద లేదు!

యువతీ !
ఓ నా ప్రియమైన కళల మైత్రీ ! 
నీ "చిరునవ్వు" మెరుపు చూసి - నేను తాదాత్మ్యత చెందుతాను!
నీ కళ్ళ కాంతులను చూసి మైమరుపుతో ----
ఆహా ! ప్రకృతి ఎంత అందం అని అచ్చెరువొందుతాను ! 

యువతీ !
ఓ నా ప్రియమైన జీవిత సహచరీ ,
నీ సమక్షంలో -----
నీ సౌందర్యం సాక్షిగా ,
నాలో ఓ సవ్యమైన మార్పు ! ఏదో సాదించాలనే ఒక తహ తహ 
అవ్యక్తమైన ఓ ఇన్స్పిరేషన్ ......
నాలో విద్యుత్ తరంగాల్లా ప్రవహిస్తాయి !
ఇదంతా -----
ఏ అద్భుత సృష్టిలో భాగం 
అనే తలంపుతో ---
ఇద్దరం---
ఔన్నత్యపూరితమైన ఓ గొప్ప చిరునవ్వులో ఐక్యం ఐ ,
తాదాత్మ్యత చెంది,
చెలీ,  మన ఆనందాన్ని వ్యక్తం చేయాలనుకునే , 
ఆ భావాన్ని అక్షరాల్లో-----
ఒక భాషలో వ్యక్తం చేయగలనా? 

యువతీ!
ఓ నా ప్రియమైన కలల మైత్రీ ----
"నీ చిలిపి చిరునవ్వు , నన్ను కదిలించే నీ బంగారపు మేని  హొయలు "  
ఎలా వర్ణించగలను చెప్పు?!
భావాన్నైతే అనుభవించగలను  గాని,
నా చిన్ని 'తెలివి' తో ------
అనంతమైన నిన్ను మాటల్లో వ్యక్తం చేయగలనా?      

నాలో  చెలరేగే---భావోద్వేగాల వెల్లువకు ----
ప్రాణం నువ్వు!
గానం నువ్వు!!
కేంద్రం నువ్వు !!!
నాలో ముసురుకొనే ఊహాకేరాటాల ఉప్పెనకు ఊపిరి నీవు !

నిన్ను గౌరవిస్తాను ! ఆరాధిస్తాను ! ప్రాణంలా ప్రేమిస్తాను! 
కృతజ్ఞత ఎలా చూపగలనా అని శతకోటి మార్గాలను అన్వేషిస్తాను !
 అంతేకాని --
నాపై నీ ప్రభావాన్ని మాత్రం 
పూర్తిగా అభివ్యక్తం చేయలేను!
అది నిజం! 
                                                              ---------- శ్రీనివాసరాజు.పి 
                                                                              04 -04 -1996  
 Cell No :- 810 6871 802
  

 
 

One Exit (Oka nishkramanam)

ఒక నిష్క్రమణం 

కలల వెలుగును అందుకోవాలని--
కళల వెలుగులో ప్రయాణం సాగించాడు ఒక సూర్యుడు !
దారిలో పున్నమి చంద్రుడు పలకరించాడు 
శిశిరం దాటిన వసంతుడు ముందుకెల్లమన్నాడు
వర్షరుతువులో పిల్లల కాగితం పడవ ఆటలు అతనికి ఆహ్లాదాన్ని పంచాయి !
శరత్కాలపు వెన్నెల ప్రేమ కబుర్లు చెప్పింది 
-------
కలల బ్రతుకు బండి కళల వెండి వెన్నెల  వైపుకు సాగుతోంది
ఇంతలో చిన్న అలజడి!
సూర్యుడు మసకబారాడు.
------
కృష్ణుడి వెలుగు , రాముడి మనసు , రామకృష్ణుడి మనసంతా మంచితనం.
ఎపుడూ పెదవులుపై చిరునవ్వులు ఒలికించే సోదరుడు.
ఇంత దారుణానికి ఎలా సాహసించావు మిత్రమా ?!
(ఎందరో సూర్యుల ప్రయాణాలు సాగుతున్నాయి 
ఒక్కో సూర్యునిది ఒక్కో కష్టం , ఇక్కడ ఎవరు సుఖంగా వున్నారు చెప్పు?
చిన్ని ఆశతో మొండి ధైర్యంతో ముందుకెల్తున్నారు తప్పితే ) 
అకస్మాత్తుగా ఒక సూర్యుడు శాశ్వతంగా అస్తమించాడనే వార్త !
ఆ సూర్యుడు పేరు రామకృష్ణ , స్నేహితులకు 'కిట్టు' గా సుపరిచితుడు !
-------
కలల వెలుగుని అందుకోలేనని 
కళల వెలుగులో ప్రయాణం సాగించలేనని
 కృష్ణపక్షపు చంద్రున్ని చూడలేనని,
శిశిరంలో చిక్కుకున్న వసంతుడు ఇక రాడని.
శరత్కాలపు కళల వెన్నెల ఒక బూటకమని ....ఏమనుకున్నాడో తెలీదు .......!
అనంత లోకాలకు వెళ్ళిపోయాడు!
(మా చెల్లెలు ఇందిర, బంగారు ముద్దుల పాప త్రైలోక్యలను ఒంటరి చేసి )
 "నేను ఓడిపోయాను" అనే చివరి మాటలు వదిలి!
"దేహముంది , ప్రాణముంది , నెత్తురుంది, సత్తువుంది ...,ఇంతకన్నా సైన్యముండునా?"
కవి మంచి మాటలు మర్చిపోయాడు.
ఒక మంచి మనిషి , ఒక మంచి కళాకారుడి అసహజపు నిష్క్రమణం...
ఒక చర్చగా, ఒక ప్రశ్నగా , 
రంగస్థలముపై ఫలయోగాన్ని చేరుకోని కార్యముగా.....
ఒక హెచ్చరికగా మిగిలింది !!!
--------
మిత్రమా నీకిదే మా అందరి కన్నీటి వీడ్కోలు!
                              --------శ్రీనివాసరాజు .పి
                                             22 -02 -2012 
                (కిట్టు మరణవార్తను మాకు చెప్పినపుడు "హను" sir  కళ్ళల్లో కన్పించిన 
                                    కన్నీటి తడికి ఆర్ద్రతతో .....)
 
ఇంకెంత కాలం 

ఒక రాగం ఎందుకు ఆగిపోయిందో ...
ఒక నర్తకి  ఎందుకు నిశ్శబ్దాన్ని ప్రేమిస్తోందో 
ఒక చైతన్య ప్రవాహాన్ని ,
విషపు జ్వాలలతో ఏ స్వార్ధంతో ఆవిరి చేసి ఎవరు ఎందుకు గాలిలో కలిపేశారో?!
......ఆలోచించే వ్యవధి మాకు లేదు. 
సాయంత్రం అయ్యేటప్పటికి ఒక హిపోక్రాటిక్ ప్రేమ కోసం సెల్ ఫోనులో షోల్లు కబుర్లుతో మేం బిజీ బిజీ ....
ఎండమావుల్లాంటి కొన్ని తింగరి కలలను అందుకోవడానికి ,
వంకరిటింకరి  మాటలతో , జీవం లేని నవ్వులతో , అబద్దపు పలకరింపులతో-----
నేడు చూడాల్సిన ఒక సత్యాన్ని చూడలేకపోతున్నాం !
ద్రౌపతికి వస్త్రాపహరణం జరుగుతోంది - తలలు ఎత్తడం ఇంకా అలవాటు కాలేదు !
"స్పందించడం " అది చాలా పెద్ద మాట! 
సత్యం చెప్పడానికి, సత్యం చూడడానికి ......ఒక భయం , 
(సత్యాన్ని అర్ధం చేసుకోవడానికి ....'అవగాహనా లోపం', "చైతన్యం" తక్కువగా వుండడం .....ఈ కధ వేరు )
......అంధకారంలో , అజ్ఞానంలో .....ఇంకెంతకాలం? 
 ----శ్రీనివాసరాజు .పి
            22 -12 -2012   
     (మహాత్మా గాంధీ...,, మార్టిన్ లుతెరకింగ్ ....., అబ్రహం లింకన్., ..........గ్రేట్ లేజేండ్స్కు కృతజ్ఞతలతో...)

"kalakantee, kanthimatee.." poem, please acknowledge, few real Telugu letters I am not finding in the templet. Example, kalakantee, here Telugu original "tee" is different, same for avunnatyam word.. , the same thing happened in other poems also in rare areas. Thank you.

కాలకంటీ, కాంతిమతీ......

"మాలినీ,  హంసినీ ,  మాతా మలయాచల వాసినీ....."

"తెజోవతీ,  త్రినయనా, లోలాక్షీ,  కామరూపిణీ.....

స్త్రీని దైవంగా , శక్తి స్వరూపంగా పూజించిన వేధభూమిలో......
బాలికా బ్రూణ హత్యలా.....?!

అబ్బాయి ---ఇష్టం (లాభం!)
అమ్మాయి పుడితే నష్టం , కష్టం!
అంచనాలు అమాయకం అందమా?!
అందనంత అనంతాన్ని అందుకునే అంతులేని స్వార్ధం   వైపుకు 
అజ్ఞానంతో, అవివేకంతో వేసే అర్ధవిహీన అడుగులు అందామా ?

"స్త్రీ " ప్రేమ లలిత్యానికి , అవున్నత్యానికి 
ఆహ్వాన్నం పలకలేకలేకపోతున్న ........
"స్త్రీ" ప్రేమ లాలిత్యాన్ని ,అవున్నత్యాన్ని 
దూరం నుంచి కూడా పొందలేకపోతున్న మనం --

అనర్హులమై వున్నాము ----నిజమైన ప్రేమకు,
అనర్హులమై వున్నాము ----"స్త్రీ" కళ్ళల్లోని మెరుపుని చూసేందుకు,
అనర్హులమై వున్నాము ----"స్త్రీ" ప్రేమను పొంది జీవితాన్ని వెలిగించికోనేందుకు !

బాలికా బ్రూనహత్యలతో  ఇంకా కొత్త పాపాలా!!!???

"మొత్తం ప్రపంచాన్నే స్త్రీఈకరిస్తేనే గాని , లేదు సాంత్వన, లేదు విముక్తి, లేదు అభివృద్ధి " అని 
అంటున్నారే కొందరు వేదికలపై !
మరి స్త్రీ శిశువును గర్భంలోనే చంపేస్తున్నాం?
ఎన్ని జన్మలేత్తితే 'కూతురు' ప్రేమను మీరు మళ్లీ పొందగలరు?
ప్రకృతికి  ప్రతిరూపం ---"స్త్రీ" .
ఆమె సున్నితత్వం , దయ, దాతృత్వం, అవుదార్యం, ప్రేమ ,జాలి, కరుణ, .......
జీవరాసులన్నిటిని ప్రేమించే స్త్రీ గొప్ప మనసు,
పచ్చదనంపై మెరిసే హేమంత తుషారం అంటే అర్ధం కాదు.
పచ్చదనం పై మెరిసే హేమంత మంచుబిందువును చూసి మురిసిపోయే 
"స్త్రీ" స్వచ్చమైన మనసు--

దుర్మార్గుడి కొంచం ప్రేమకు కూడా  లొంగిపోయే ఆమె అవుదార్యం .....
(దీనిని బలహీనత అనొద్దు, అనుకోవద్దు , అది ప్రకృతి దయ, క్షమాగుణం, గొప్పదనం, బెనవలేన్స్ ...)

తల్లిగా నిన్ను నిలబెట్టింది!
యవ్వనం నుంచి, ఇంకో "స్త్రీ" ప్రేమ నిన్ను ఆదుకోవాలి.
..............డోంట్ డిస్టర్బ్ ఈకోలోజి !
నేటి యువత, రేపటి యువత 
ఆ ఆదుకునే హస్తం కోసం యుద్దాలు చేయాల్సిన పరిస్తితి రూబోతోంది .

అమ్మాయి పుట్ట బోతోంది ,
"ఫ్రమ్ ది రష్టుసిటీ  ఆఫ్  విల్లెజేస్ టు ది గ్లిట్జ్ ఆఫ్ మెట్రోపోలిస్".......
"....గర్భంలో ఆడపిల్ల....", లెట్స్ సెలెబ్రేట్ .
వింధ్యాచల నివాసినీ ,
పంచబ్రహ్మ స్వరూపిణీ,...
మీ కుటుంబంపై యుగయుగాల నాటి ప్రేమామృతం కురవబోతోంది ......
"ఆడపిల్ల పుడుతోంది !"
ప్రేమ లాలిత్యానికి, అవున్నత్యానికి ఆహ్వానం  పలకండి !
మురిసిపోవాల్సిన గొప్ప అదృష్టం అది.

అమాయక బాలికాబ్రూనహత్యలు .....గర్భంలోనే "స్త్రీ" శిశువుని  చంపేయడం అంత ఆటవికం???!
"స్త్రీ" పవిత్ర పాదధూలిని , భక్తితో , ఆరాధనతో కల్లకద్దుకొని.........
జ్ఞాన ప్రచారంతో , చేసిన చేస్తున్న తప్పులను ,
పాపాలను కడుక్కునే ప్రయత్నం చేస్తామని మాటే ఇస్తూ -------
క్షమార్హం కాని తప్పులు, క్షమించమని అడిగేదేలా ??!!

"సుమిఖీ , నళినీ, .......,సురనయకా....
కాలకంటీ, కాంతిమతీ,  క్షోభినీ , సూక్ష్మరూపినీ  ......"

                                                      --------శ్రీనివాసరాజు .పి
                                                                  14 -12 -2011 

(మురళి & పద్మలకు మార్చ్ ఆరు ,2012  న     పుట్టిన ఆడపిల్లకు ఈ పోఎం అంకితం) 

                              








Priya Nestam(An intimate talk with Creator, God.)

ప్రియ నేస్తం 
( ఎన్ ఇంటిమేట్ టాక్ విత్ క్రియేటర్ )
అస్తిపంజరాలకు మాంసంముద్దల తొడుగు తొడిగి 
రక్తం నీళ్ళతో నింపి , చర్మం తోలు కప్పి -----
ఏ కుట్లు కుట్టి....
ఎలా ఈ బుడగలోకి ఊపిరి వూదావో ..!!!!!!

నీ అందమైన సృష్టి చూడ్డానికి 
రెండు కళ్ళు- అవీ మాంసంముద్దలే !
మెదడులో ఏ రసాయనిక పదార్దం నింపావో కాని----
మెదడు ఫన్క్షనింగ్ జరగడానికి
ఏ రకమైన ఇంతేగ్రతేడ్ సర్క్యుత్యుస్ వాడవో ----
వాటిని నియంత్రించే రిమోట్ రహస్యం ఏమిటో ...?
గుండెను కదిలించే , మనసును ఉద్రేకింప చేసే ఆలోచనలు ఒక వైపు ---
శాంతిని , చల్లదనాన్ని కల్గింప చేసే మల్లపువ్వుల లాంటి సున్న్నితమైన పరిమలాలు ఇంకొకవైపు !

యవ్వనంలో 
ఈ స్కేలేటన్  చేసే మాయలు నీకు తెలుసా?
ఒక యువకుడిగా నాకు తెలుసు , 
నేను అనుభవించాను , ఇంకా అనుభవిస్తున్నాను .
ఈ మాంసంముద్ద మాయలు నేను తిలకించాను .
ఏమి మెరుపులు? ఏమి ఉరుములు ? ఎన్ని వెన్నలలు? ఎన్ని వద్దికలు ......
నా సహచరి కళ్ళలో నిన్ను దర్శించి కృతజ్ఞతలు తెలిపాను .

ఈ శరీరం మట్టిలో కలిసిపోక తప్పదు.
10  సంవత్సరాలు 10  క్షణాల్లా గడిచిపోతున్నై.
జీవితం ఒక గొప్ప స్త్రీ సహచర్యంలో గడవడం అద్బుతమైన వరం!
మామూలు రోజువారీ మలినమైన కల్మషం "ప్రేమపై" పడకుండా కాపాడుకోవడం 
"స్త్రీ-పురుషుల  ధర్మం "
వారే జీవితాన్ని సార్ధకం  చేసుకోగలరు. వారే ధన్యులు .

ప్రియనేస్తం (టూ క్రియటర్....)....
నా ప్రియ నేస్తాన్ని(ఆ అద్బుత స్త్రీ మూర్తిని ) , నా కోసం పుట్టిన , నా సహచరిణి ....
నాకు చూపించు. (ఆ అర్హత కోసం ఏమి చేయమన్నా, చేస్తాను. ఏ అబ్యాసం, ఏ వున్నత విలువలు ....అన్ని ఇంకా నేర్చుకుంటాను)
ఆమె మనసులో నాకు చోటు కావాలి.
కాదు మొత్తం మనసంతా నాకే కావాలి. 
                                             -----శ్రీనివాస రాజు .పి
                                        (మొదట రాసిన తేది :- 09 -06 -2005 , కొంచం మార్పులు చేసిన తేది :- 20 -03 -12 ) 

chilakamarti gari "Bharata khandampu chakkani padiyavu..." Great Poem..

"భరత ఖండంబు చక్కని పాడియావు 
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ 
తెల్లవారను గడుసరి గొల్లవారు 
పిదుకుచున్నారు మూతులు బిగియగట్టి "

                      -------- చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు
1907  ఏప్రిల్ నెలలో  రాజమండ్రి లో బిపిన్ చంద్రపాల్ సభ లో ,   చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు ఈ పై పద్యాన్ని మొదటి సారి చదివారు. ఇది చిలకమర్తి గారు రాసిన పద్యమే. (ఈ పద్యాన్ని చెన్నాప్రగడ భానుముర్తిగారు రాసారు అనే  ఒక వాదం వుంది. కాని అది పూర్తిగా సత్య దూరం అని నా పూర్తి విశ్వాసం.). పాల్ గారి ఇంగ్లీష్ ఉపన్యాసాలను చిలకమర్తి గారు, తెలుగులో చెప్పేవారు. ఆరోజు సభలో , ఈ పద్యానికి ఒన్సుమోరెలు ...చాలా పడ్డాయంట.




"భరత ఖండంబు చక్కని పాడియావు 
భారతదేశ ప్రజలు లేగేదూదలై ఏడ్చుచుండ 
నేటి రాజకీయనాయకులు, ఇంకొందరు దుర్మార్గపు వ్యాపారవేత్తలు, మరికొందరు స్వార్ధ పరులు  ........
పిదుకుచున్నారు మూతులు బిగియగట్టి" 
                               -----శ్రీనివాస రాజు .పి
                                        20 -03 -2012  
      -------------నేటి వ్యవస్థకు, చిలకమర్తి గారి పద్యం , కొంచం మార్చి రాసాను.(వ్యాకరణం లో వొదుకుతుందా నేటి దేశ అవినీతి, ...విలువలు, క్రమశిక్షన లేని,....., చాలామంది ప్రజల స్వార్ధం.......!!!???, "దూరేవి దొమ్మరి గుడిసెలు చెప్పేవి శ్రీరంగనీతులు...." అని ఒకరి గురించి ఒకరు వాళ్ళు చెప్పుకునేది చాల నిజం. "దొరికితేనే దొంగలు లేకపోతె దొరలు" కదా అని నమ్మి, దొరకనంత సేపూ, తమ అంత నీతివంతులు లేనట్టు మాట్లాడుతున్నారు. కొంచం డబ్బు సంపాదిస్తే,....డబ్బుని చూసి గర్వం. నేను ఏమి చెప్పినా చెల్లుతుంది అనే అహం రాజ్యమేలుతోంది. డబ్బుని చూసుకుని నాకు అంతా తెలుసు అనే దురహంకారం. ఈ డబ్బు పక్కన కొంచం రాజకీయ అధికారం కూడా తోడైతే, ఇక పిచ్చికోతికి కొబ్బరి కాయ దొరికినట్టే, వాళ్ళ ప్రవర్తన వెర్రితలలు వేస్తుంది. సమాజంతో ఆటలు మొదలుపెడున్నారు.  . నిజమైన ప్రేమ, దయ, దాతృత్వం, కరుణ, ఆప్యాయత ,......,పక్క వాడి కష్టానికి నిజమైన కన్నీళ్లు కార్చే మానవీయ మనుషులును బూతద్దంలో పెట్టి వెదకాలి. జారిపడుతున్న మనిషికి సాయమందించే చేతులు కరువయ్యాయి. జారిపడుతున్న మనిషిని చూస్తే వాళ్ళకు ఒక నవ్వులాట, ఒక ఎకసక్కం, ఒక చోద్యం , ఒక వినోదం .....దాన్ని ఆనందించే ఒక శాడిజం!  భయంకరమైన హిపోక్రసి లో , ఒక డొల్లలో .....,హేడోనిజంలో....నేటి సమాజం వుంది. ---శ్రీనివాసరాజు. పి , 20-03-12    )

Blood

నా ప్రజలు 


నా నెత్తురు ,
నా రక్తం,----
నా మానవ జాతిలో భాగం మీరు.


ఒక్క క్షణం మీరు బాధ పడ్డారా--?
నేను బ్రతికి వుండి ఏం ప్రయోజనం?

ఏ శక్తి 
ఎన్ని యుగాల తర్వాతైనా,
మిమ్మలను రక్షిస్తుంది ?

మీ కోసం నేనేం చేయగలను?
     
                  శ్రీనివాస రాజు .పి
                       లక్షివారం(గురువారం) 
                        09 -06 -2005  (రాసిన సమయం ,  రాత్రి 10  తర్వాత ) 


(కళారూపాల ద్వారా , రచనల ద్వారా , నేను చేయాల్సినది .....నా బాద్యత గా  చేస్తాను., నిజమైన ఆద్యాత్మిక ప్రచారం, సత్య ప్రచారం,.....,శాంతి, గాంధీ మార్గాన్ని నేను గౌరవిస్తాను., నేటి నా  విశ్వాసం ఇది .)

Sunday 18 March 2012

దేశమంటే .....,

దేశమంటే "మనుషులు ఐతే" .....

కొందరు మనుషులు......

నా దేశంలో నదుల గర్భాలు ,
'భూగర్భ జలం' అనే పవిత్ర పసిపిల్లల చిరునవ్వులను రూపాంతరం చేసే 
బంగారు ఇసుకను,
కటికవాడు 'పవిత్ర గోవును' వధ చేసినట్టు ----
నది వడిలోంచి 'ఇసుక గర్భాన్ని ', 
గర్భంలో ఆడపిల్లను భ్రుణ హత్య చేసినట్టు, 
తెగనరికి, బజారు లో తన లాభం కోసం ,
"సరుకు " గా అమ్మేస్తున్నారు . ----"ఎంత పాపం?"
------------
దేశమంటే మట్టికూడా నోఇ ......
ప్రాకృతిక సౌందర్యం , ఈ దేశ కొండలు, అడవులు, 
అగ్ని దాగిన పర్వతాలు , అన్నం దాగిన అడవులు, 
ఐరన్ ఒర్ దాగిన గనులు , .......
అన్ని అక్రమంగా తరిలిపోతున్నై !
ఈ దేశ మనుషులే తరలించేస్తున్నారు.
బంగారం దాగిన నా దేశ మట్టిని దోచేస్తున్నారు!
నా దేశ మనుషులే, నా దేశ మట్టిని సరుకు గా  వాళ్ళ లాభం కోసం, వాళ్ళ సౌఖ్యం కోసం...వాళ్ళ పిచ్చి విలాసాల కోసం 
......అమ్మేస్తున్నారు. 
దేశం పై విష సంస్కృతిని గుమ్మరిస్తున్నారు. 
ఎవరు వారు? వారా? నా దేశమంటే? 
"దేశమంటే మనుషులు" అని , ఆ మనుషులును నా దేశంగా చూడనా?
------------------
వద్దు, దేశమంటే మనుషులు అయితే , ఆ మనుషులు నాకు వద్దు.
నాకు ఈ దేశ మట్టి కావలి.
దేశమంటే  "మట్టి " అని నిర్వచించుకొని ,
ఆ మట్టిని , ప్రకృతిని , భవిష్యత్ తరాల కోసం కాపాడుకుంటాను.
ఈ దేశ నదులు, నదుల్లో ఇసుక , నీరు, పొలాలు , జలపాతాలు, అడవులు, కొండలు, గనులు, తోటలు , వాగులు, వంకలు,..........సముద్ర ప్రాంతాలు ......అన్నిటిని కాపాడుకుంటాను. , (కాపాడుకోవాలి!!!???)
దేశమంటే మట్టికూడా నొఇ  అని ఎలుగెత్తి పాడుకుంటాను.
------------------
                                                    ----------శ్రీనివాస రాజు.పి
                                                                     30 -01 -2012 (అర్థరాత్రి) 
(గురజాడ, గాంధీ లకు, మరియు ప్రకృతి  ప్రేమికులకు , కృతజ్ఞతలు )

Saturday 17 March 2012

Love Poem

ప్రేమ పిలుస్తోంది  
ప్రేమ పిలుస్తోంది ,
ద్వేషం పోమ్మంటోంది,
.........రమ్మంటోంది ,
జీవితం హెచ్చరి స్తోంది , భవిష్యత్తుని  చూడమంటోంది ,
అనవసర  మత్తులో కి  దూక వద్దు అంటోంది ,
(నీ కర్తవ్యం, బాద్యత, అంటే వైయక్తిక బాద్యత మరియు సామాజిక బాద్యత ............నేర వేర్చిన తర్వాత .....అద్బుత వ్యక్తి దొరికితే అప్పుడు కదా "ప్రేమ ")
క్రమ శిక్షణ , కష్టపడడం, మరియు ఇష్టమైన పని మీద భక్తి ద్వారా ....జీవితపు ఎత్తులు ....ఎక్క మంటోంది,  అంతరాత్మ.
అంతరాత్మ  
ఈ పోఎం హెడ్ ఇంకు  "ప్రేమ పిలుస్తోంది " అయితే , డౌన్ ఇంకు , "అంతరాత్మ " (కొంచం గమనించండి. )


శ్రీనివాస రాజు .పి
18 -03 -2012  

Wednesday 14 March 2012

Silence

ఒక  నిశ్శబ్దం 
(3)

ఒక నిశ్శబ్దం  గత జన్మ రహస్యాలను వెదుకుతుంది.
ఒక నిశ్శబ్దం జీవితం ఇంత చిన్నదా అని నిట్టూరుస్తుంది.
ఒక నిశ్శబ్దం ....ప్రతీ క్షణం  ఆస్వాదనలో.......

Thursday 8 March 2012

ఒక నిశ్శబ్దం
(2)

"ముందుకెలుతున్న స్త్రీ........, స్వావలంబన, మహిళా సాధికారత గురించి గర్వంగా చెబుతుంటే.....
ఒక నిశ్శబ్దం.......ఇప్పటికీ అనగదొక్క బడుతున్న......వేల స్త్రీల.....మౌన వేదేనలను....గమనించ మంటుంది. 
పురుషుడైనా, స్త్రీ అయినా......ముందు మంచితనం, కరుణ, ప్రేమ .......,క్షమాగుణం, దాతృత్వం, ......అభ్యాసం  ద్వారా నేర్చుకుని,        

      "అర్హత పునాదులు మీద .....హక్కుల జెండాలను ఎగుర వేయాలి "
       ముందు కెల్లు ప్రియతమ నేస్తమా, సహచరీ.....,
                                        -------నాకు ప్రేరణ కలగచేసిన ప్రతి మంచి మనిషికి , స్త్రీ లోకానికి కృతజ్ఞతల తో  


                                                             మహిళా దినోత్సవం , సందర్బంగా
                                                           ------శ్రీనివాస రాజు. పి
                                                                     08 -03 -2012   



Wednesday 7 March 2012

Silence Poem

ఒక  నిశబ్దం 

ఒక నిశబ్దం గత జన్మ రహస్యాలను వెదుకుతుంది.
ఒక నిశబ్దం జీవితం ఇంత చిన్నదా అని నిట్టూరుస్తుంది.
ఒక నిశబ్దం ....ప్రతీ క్షణం  ఆస్వాదనలో.......

Tuesday 6 March 2012

Creator in Silence

(1) ఒక నిశ్శబ్దం 

ఒక  నిశ్శబ్దం జీవిత సౌందర్యాన్ని మౌనంగా గమనించమంటే .....
ఒక నిశ్శబ్దం, సముద్ర కెరటంలా నింగికెగసి ....మెరుపు వెలుగును, 
నక్షత్ర సొగసును చూసి , .....
............వెన్నల మిల మిల ....కన్పించే కళ్ళలో .......మానవీయ స్పర్సకు కృతజ్ఞతలు చెప్పమంది.
                                               ---06 -03 -2012  
                                             ----శ్రీనివాస రాజు. పి

Monday 5 March 2012

మీరు అంటే

 ఆశ్చర్యం   " మీరు" అంటే మనిషి అస్తిత్వ వైయక్తిక తాత్విక పునాదులు కుడులుతాయ?
ఒక్కడిగా వచ్చి,
ఒక్కడిగా వెళ్ళడం నిజమే!
నీ వైయక్తిక సాధనను సమూహం పై రుద్దుతానంటే ఎట్లా?
ఒక్కడివే నిజం, కాని
రెండు శరీరాల అద్వైత అనుభవం నీ సంభవం !
నిటాలేక్షనుడి సమక్షానికి నిన్ను చేర్చడానికి నాలుగు భుజాల సాయం అవసరం అని మర్చిపోయావా?
నిష్కల్మషమైన ప్రేమను పొందే, ఇచ్చే సహచరి వుంటే ఆమె తో  నువ్వు , నీతో ఆమె --పిలుపులు ప్రదానం కాదు! 
ఆత్మ సాన్నిహిత్యమే ప్రధానం అక్కడ!
కాని సామాజిక స్వేఛ్చ వేరు, వైయక్తిక స్వేఛ్చ వేరు మిత్రమా!
కొత్త మనుషులకు, కొత్త స్నేహాలకు "నువ్వు" అంటూ మొరుటుగా ఆహ్హానం పలుకుతానంటే ఎట్లా? 
ఔవన్నత్యాల అంతరం చైతన్యాల అంతరం వున్నపుడు 
'ఏకవచనంలో' పిలుపు ఆహ్హనిన్చదగినది అంటావా మిత్రమా?
సాన్నిహిత్యం చిన్నదైనపుడు , గౌరవ వాచకం  ఎదుటి వారి హృదయం తలుపులుల పై ప్రేమ జల్లు కురిపిస్తుంది.
ఆంగ్ల భాష కు లేని సౌలబ్యం , తెలుగు భాషకు వున్నా సున్నితత్వం గౌరవ వాచకం "మీరు" అనేది!
"తండ్రి ని , గురువునీ ........" కూడా నువ్వు అని ఏకవచనం తో పిలుస్తానంటే ఎలా మిత్రమా?
అసహజపు బహువచనాలు , అసహజపు గౌరవ వాచకాలు , ఆడంబరపు భుజకీర్తులను తిరస్కరిద్దాం!      
కొంచం ఆలోచించు కొప్పర్తి నేస్తమా!
                                                             -----05 -03 -2012  

         05 - 03 -2012   వివిధ "ఆంధ్రజ్యోతి" లో 'కొప్పర్తి' రాసిన 'ఒక నిరాకరణ' అనే కవితకు ప్రతిస్పందన గా---