Friday 19 October 2007

LOVE

DIVINE LOVE 


ప్రేమ 

రైతు కష్టాన్ని చూడని ప్రేమ ఒక ప్రేమేనా ?

పశుపక్షాదులను ప్రేమించని ప్రేమ ఒక ప్రేమేనా?

వర్షం చినుకు అందాన్ని గమనించని ప్రేమ ఒక ప్రేమేనా?!

కార్మికుడి కష్టానికి స్పందించని  ప్రేమ ఒక ప్రేమేనా?  

నది అందాన్ని, సముద్ర కెరటాన్ని, మేఘం మెరుపుని..... 
గుర్తించని ప్రేమ ఒక ప్రేమేనా ?

అనంత విశ్వాన్నే కాదు, భూగోళంపై వున్న పర్వతాల వంపు, 
ఆ పచ్చిక మైదానాల వెలుగు, ఎవరెస్ట్ మంచు....., అన్నిటినీ ప్రేమ వీక్షిస్తుంది !

నిశ్శబ్దం  లోని శబ్దం , 

శబ్దం లోని నిశ్శబ్దం ..... 

అన్నిటినీ వింటుంది. 

ప్రేమ ఒక నిజాయితీ , 

ప్రేమ ఒక నమ్మకం, 

ప్రేమ ఒక సత్యం, 

ప్రేమ ఒక భరోసా , 

ప్రేమ ఒక నిరంతర సంభాషణ, 

ప్రేమ ఒక మౌనం, 
(ఈ మౌనమూ మాట్లాడుతుంది)

ప్రేమ ఒక అభ్యాసం !

ప్రేమ ఒక ఆత్మ అన్వేషణ. 

నిజమైన ప్రేమ నిన్ను మనిషిలా ఎదిగేలా చేస్తుంది. 

సంకుచితత్వం వైపుకు, చీకటి వైపుకు, స్వార్ధం వైపుకు, ---DIVINE  LOVE నడిపించదు. 
-------------------------*************------------------

ON THE CONTRARY :-

ఒక మనిషిని మలినత్వం వైపుకు, 

అజ్ఞానం వైపుకు, ఒక బలహీన వ్యసనం వైపుకు, 
(అది అతడు నేర్పిన క్షుద్ర శృంగారం ఐనా కావొచ్చు),

ఆ స్త్రీని మానసిక బలహీనురాలిగాను, (వ్యభిచారినిగానూ కూడా), వ్యసన పరురాలిగానూ, ఆందోళనా మనస్కురాలిగానూ, 

ఒక నిర్లక్షపు తెగింపు మనిషి గానూ ,

జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకునే మనిషిగానూ---
(IN SOME CASES....మంచి మనిషినీ, మంచి మాటను, ప్రతీ విషయాన్నీ అనుమానించే .....ఒక అనుమానపు దెయ్యం గానూ...మారి, ఇక BALANCE LIFE ని MISERABLE గా గడిపే జడ పదార్దం గానూ కొందరు స్త్రీలు మారవచ్చు.మారుతున్నారు.  మితి మీరిన అతి జాగ్రర్త వల్ల  జరిగే ప్రమాదం ఇది)

తన అపురూపత్వాన్ని గుర్తించని మనిషిగానూ--చేస్తుంది.... 

చేస్తుంది ........ 

"ఒక దుర్మార్గుడి చీకటి క్షుద్ర  హింసా రాక్షస శృంగారం". 
(ఆ క్షుద్ర  స్వార్ధపరుడి రాక్షస శృంగారం ఆ మంచి స్త్రీని, ఇట్లా మారుస్తుంది, ఇట్లా చేస్తుంది)

ఆ క్షుద్ర మానసిక రాక్షస దాస్య శృంఖలాల నుంచి 

ఆ "స్త్రీ" బయట పడి ---

"దేవతా స్త్రీ" గా మారితే (అలా విజయం సాదిస్తే --)

అది నిజంగా అద్భుతం!

ఆమె ఎందరో స్త్రీలకు ఆదర్శమూర్తిగా నిలుస్తుంది!
(అపుడు నిజమైన ప్రేమ ఆమెని వరిస్తుంది. నిజం పునాది మీదే కదా, నిజమైన ప్రేమ .. నిలబడేది)      

                                ----శ్రీనివాస రాజు .పి 
                                          2013







Thursday 18 October 2007

ఏ నిశ్చల రూపానికి




ఏ నిశ్చల రూపానికి ప్రాణం వస్తే --

'మనిషి' అనే చైతన్యంగా మారి ---

భూమి పై ఒక మహాద్భుతంగా ఆవిష్కృతమైందో!

ఇవన్నీ కనిపిస్తున్న ప్రాణశక్తులు. (All Species, including Trees)

కనిపించని ప్రాణశక్తులు ఈ భూమిపై ఇంకెన్ని వున్నాయో!


                   --శ్రీనివాస రాజు .పి 

------2013
(Theory of Evolution....... I am not contradicting ..... Please take this poem just as an expression...,) 


మీ మంచితనం మిమ్మలను గొప్పవారిని చేస్తుంది 


అడ్డంకులు ,

అతిశయాలు, 

అనుమానాలు, 

అహంకారాలు 

....................., 

వీటన్నిటిని దాటి 
"మనిషి మనిషితో మాట్లాడుకోవడం 
నేటి సమాజంలో సాద్యం కావడం లేదు"

"నువ్వు మాట్లాడుతున్నది ఒకటి 
మనసులో దాచిన నిజం ఇంక్కొకటి "

దేనికొరకు నవ్వుతున్నావో - విషాదం వ్యక్తం చేసేది ఇంకెందుకో... 
"సత్యం వెనుక ఏది వుందో?!
అసత్యం వెనుక ఇంకేది దాచావో?!" 
ఏ మాట వెనుక ఏ స్వార్ధం  వుందో !

నీ వాదం(Argument) వెనుక ఏ 'మానసిక జాడ్యం' దాగి వుందో 
నీకే తెలీకుండా ఏ మానసిక బలహీనత నీ వ్యక్తిత్వాన్ని నడిపిస్తోందో?!

మరీ ముఖ్యంగా----
ఆ రోజు ఆ పూట నీ 'అవసరం' కోసం ఏ మాట మాట్లాడుతున్నావో?
తిన్నావా? అవసరానికి సరిపడా డబ్బు ఉందా?

నీ ఆశయం, లక్ష్యం, నువ్వు నడుస్తున్న జీవితం, వేస్తున్న అడుగులు ... 
...... నిన్నటి రోజు "నీ చిరునవ్వు వెలిగిందా?"
ఇంకేం పర్లేదు జీవితం 'బిందాస్' అని రాత్రి నిద్ర పోయేటప్పుడు   
నీతో నీవు హాయిగా అనుకోగల్గుతున్నావా?

నీ ఆదర్శం ఏ చేనేత శ్రామికుడి కష్టాన్ని--
నీ ఆదర్శం, నీ ఉపవాసం, ఏ రైతు కన్నీటినైనా..... 
.......ఆదుకుంది....అనే నమ్మకం, సంతృప్తి నీకు ఉన్నాయా?
(నీ ఊపిరి ఈ సమాజానికి ఉపయోగ పడుతోందా?....Are you Questioning your Accomplishments?)
కనీసం నీతో నీవు నిజాయితీగా వుండగల్గుతున్నావా ?
లేదా నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావా?
నీ కుటుంబం, నీ పిల్లలు నిన్ను ప్రేమిస్తున్నారా?
ఇప్పటి వరకు నీవు సాధించిన విజయాలు నిన్ను సంతృప్తి పరిచాయా/
ఇక పైజీవితం పై  నీ నమ్మకం ఎంత?

లేదా -----

ఒక మంచి మార్పుతో -
నిజాయితితో -
కొత్త అభ్యాసాన్ని నేటి నుంచైనా ప్రారంభిస్తావా?
ఒక మంచి సంస్కారం వైపుకు ,
ఔన్నత్యం, ధర్మం వైపుకు--,
లాలిత్యం వైపుకు, నీతి  వైపుకు,
దయ, కరుణ, దాతృత్వం వైపుకు, 
మరీ ముఖ్యంగా -- "సహనం" వైపుకు ,
శ్రమైక జీవన సౌందర్యం వైపుకు....... 
 ప్రేమ వైపుకు, 
మానవీయ పరిమళం వైపుకు, ----
క్షమాగుణం వైపుకు,  "శాంతి" వైపుకు , 
"See the things from others Point of View" అనే దృక్కోణం వైపుకు, 
"వినడం నేర్చుకుందాం! మాట్లాడడానికి తొందరేముంది" అనే మంచి మాట వైపుకు, 
ద్వంద్వ ప్రమాణాలు (Double Standards),
కపటత్వం (Hypocrisy),
లేని విశాల దృక్పదం వైపుకు, శాస్త్రీయత వైపుకు, ---
అడుగులు వేయగాలవా? 

"అడ్డంకులు , అతిశయాలు, అనుమానాలు, అహంకారాలు....
తొలగించుకుని?" 
----------
వేసే ఆ అడుగులుతో 
కొత్త ప్రపంచ నిర్మాణం జరుగుతుంది
మరి నీ మొదటి అడుగు ఎప్పుడు వేస్తావు?

                        -----  శ్రీనివాస రాజు. పి 
                        ------  26-09-2013