Thursday 11 April 2013

DIVINE EXPRESSION




DIVINE EXPRESSION 



"కీర్తి గురించిన ఆలోచన లేకుండా పని చేసేవారి ద్వారా             
దేవుడు మహత్కార్యాలు చేయిస్తాడు"




 ( నేను ప్రాణంగా ప్రేమించే EXPRESSION ఇది)

                       (దీని Title మాత్రమే నాది)

                       -----శ్రీనివాస రాజు .పి 
                                 11-04-2013
        E-Mail :- hellopsraju@ gmail.com 
        Cell No :- 0091 810 6871 802





Friday 11 January 2013

Nirbhaya (Poem)

నిర్భయ 

నిర్భయ, ఏ బీభత్సం నీ ఉనికిని అదృశ్యం చేసిందో !?
నింగి కెగురుతూ నీవు రాల్చిన కన్నీటి చుక్కలు .........
నిప్పు కణికలై  మా 'కుసంస్కారపు' - ముసుగులను -
ఇంకా కాల్చాయో లేదో తెలీదు!

కానీ - మహా సంద్రమై "యువత" నీ వెనుక నిలబడి పోరాడింది !
(కొడి గట్టిన దీపంలా ఉన్న "ఔన్నత్యపు  వెన్నెల వెలుగుపై" ....చిన్ని ఆశ...) 

నిర్భయ - సమిధగా నీవు చేసిన ఆత్మత్యాగం -
నిర్భయంగా నిద్రపోతున్న వ్యవస్థను నిద్రలేపిందా --?! "లేదా ......
"అయి శతఖండ విఖండిత రుండ వితుండిత శుండ గజాతిపతే-
రిపుగజగండ విదారనచండ పరాక్రమశుండ మృగాధిపతే -
నిజభుజదండ నిపాతితఖండ విపాతితముండ భటాధిపతే......."
అని ప్రతి "స్త్రీ" మహిషాసుర మర్దినై  హోంకరించాలా ....???!!!"
..............
"కదిలేదీ , కదిలించేదీ ----
మారేదీ , మార్పించేదీ ------
................................
పెనునిద్దర వదిలించేదీ -----
పరిపూర్ణపు బ్రతుకిచ్చేదీ-------"
మహాకవి మంచి మాటల్లో జాతినిర్మానం కొనసాగాలి !
నిర్భయ నీముందు దోషుల్లా నిలబడ్డాం !
క్షమించమని అడగలేం ......!
కానీ "కళ్యాణి "----కళారూపంగా ---
అందుకో మా కన్నీటి నివాళి !

               -------శ్రీనివాసరాజు.పి 
                         11-01-2013 

                    Cell No :- 0810 6871 802

                   E-Mail :- hellopsraju@gmail.com  









  












Monday 3 September 2012

"RAJAHAMSA" :- Ram Gopal Varma, A Truthful Journey by an Extra-Ordinary Human-being.

రాజహంస  
(కపటత్వం ముసుగును కాల్చేసిన సృజనాత్మక చైతన్యం రామ్ గోపాల్ వర్మ )

Truth, Purity, UN-selfishness wherever these are present there is no power below or above the Sun, to crush the possessor there off, equipped with these one individual is able to face the entire Universe in Opposition”  - Swami Vivekananda

"సత్యం , పవిత్రత, నిస్వార్ధత - ఎవరి యందు వర్ధిల్లుతాయో వారిని ఈ ప్రపంచంలో ఏ  శక్తీ నాశనం చేయలేదు. మొత్తం ప్రప్రంచం ఒక్కటై ఎదిరించినా వారు ప్రతిగటించగలరు"--స్వామి వివేకానంద 

నిజాయతీ, నిజాయితీగా నీ ముందు నిలబడితే ----నీవు చూడగలవా? 
 సత్యం సత్యవంతంగా సత్యాన్ని చూపిస్తే మామూలు  మానవనేత్రం----

     "అబద్దాలు  చూడడానికి అలవాటు పడిపోయిన మానవనేత్రం ---
     "కపటత్వాన్ని సహజత్వంగా అంగీకరించడానికి అలవాటు పడిపోయిన మానవనేత్రం -

   " ఈ 'అంగీకారం'--"అలవాటుగా" మారి వందల సంవత్సరాలు గడిచిపాయింది. అసహజపు అలవాటులను, సహజపు అలవాటులుగా-గుర్తించడం అలవాటు చేసుకున్న ఈ మామూలు  మానవనేత్రం---
    రామ్ గోపాల్ వర్మ అనే సత్యాన్ని , రామగోపాల్ వర్మ అనే ఒక నిజాయితీని , రాంగోపాల్ వర్మ అనే ఒక ధర్మబద్ధమైన ఆలోచనా  పరంపరని, హేతుబద్దతని, వేసవి మధ్యాహ్నం నల్లటి మబ్బులు కమ్మి, చల్లటి చిరుజల్లు కురిసినప్పుడు కలిగే హాయి అంత  సహజమైన, నిజాయితితో కూడిన ఆ ఆలోచనలు .......

అసహజత్వంతో నిండిపోయిన, ఈ ప్రపంచం అంగీకరిస్తుందా? 
 కాని ఈ సుదీర్గ  మానవ సమాజంలో, రెండు మూడు వందల సంవత్సరాలు తర్వాత తెలుస్తుంది, "రాంగోపాల్ వర్మ" అనే అద్భుతం,  మనవ సమాజం పట్ల ఎంతో  బాద్యత ఫీల్ ఐన ...ఒక గొప్ప మానవీయమూర్తి ....రక్తమాంసాలతో ఈ భూమి మీద తిరిగాడు అని. 

క్రూరత్వం నిండిపోయిన ఎన్ని చూపులు (ఆ సత్యాన్ని , ఆ నిజాయితినీ తట్టుకోలేక) బెదిరించాలని చూసినా నిజాయితిగా  జీవించాడని. 
 
 సత్యం చెప్పినందుకు సోక్రటీస్ కి  విషం ఇచ్చి చంపేసింది ఈ ప్రపంచం! ఇంకొకరికి శిలువ వేసింది........సత్యవంతంగా వుండే మనుషులును ....ఈ ప్రపంచం తట్టుకోలేదు.

నిజం నగ్నంగా మన ముందు నిలబడితే ....మనకు గిల్టీ ఫీలింగ్. ఎంతో అపరాధ భావం. నిన్న రాత్రి పరస్త్రీ తో, పరాయి స్త్రీతో - మనం చేసిన మనో వ్యభిచారం గుర్తుకు వస్తుంది. ఎవరకూ తెలీకుండా.....ఈ ప్రపంచాన్ని మోసం చేస్తూ.. అబద్దాలు చెప్పుకుంటూ బ్రతికేస్తున్న మన మనోనైజాన్ని మనకే తెలీకుండా- ఒక మాంత్రిక మాయా అద్దంలోజుగుప్సాకరమైన మన అంతరాత్మని మనకే చూపిస్తే-మనం తట్టుకోగలమా???!!! అలా చూపించిన వ్యక్తీ మీద మనకు ఎంత కోపమొస్తుంది? రాంగోపాల్ వర్మ తన గురించి నిజాలు చెప్పుకున్నా, అతను  మన రహస్య జీవితపు నిజాలు చెప్పెస్తున్నాడని మనం ఎన్ని సార్లు భుజాలు తడుముకోలేదు చెప్పండి?!
రామ్ గోపాల్ వర్మ ఒక ఆదర్శ ప్రపంచాన్ని డ్రీం చేస్తున్నాడు. మహాత్మా గాంధీ, అహింసను ఆయుధంగా తీసుకుంటే....రామ్ గోపాల్ వర్మ సత్యాన్ని, నిజాయితీని ఆయుధంగా ఎంచుకున్నాడు. Aesthetic contribution తో, ఇన్ని కళాఖండాలు తీసిన, ఈ సృజనాత్మక చైతన్యం- " తాను స్వార్ధపరున్ని " అని చెప్పుకునే మాట ---- ఈ సమాజంపై తన ధర్మ నిరసనను సున్నితంగా, లేదా మీ భాషలో వైలెంటగా వ్యక్తం చేస్తున్నాడు. ఒక స్త్రీ స్వచ్చమైన ప్రేమను చూపించన "రంగీలా" , "నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని...,అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని....." అని కవితో గాయంలో చెప్పించాడు. ఇంచుమించు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యవస్థలను ...డాక్యుమెంటు చేసిన "సత్య", "కంపెనీ "......, మిగతా కళాఖండాలు క్షణ క్షణం , నాచ్ , భూత్, సర్కార్ , నిశబ్ద్, రన్, రక్తచరిత్ర, .....అన్ని రాము సున్నిత హృదయ సంభాషణలే. కంపెనీ సినిమా చూ సి , ఒక "Meditation" లోకి వెళ్ళిన భావం కల్గింది అని నాకు ఒక   University student చెప్పాడు.

నేటి కపటపు ప్రపంచంలో, ఏ Entrepreneur, ఏ  Business man , ఏ  Celebrity , ఏ  Industrialist, ఏ  Box Office Big Hero చేయని సాహసాన్ని రాము చేస్తున్నాడు. అది నిజం నిజంగా మాట్లాడడం అనే సాహసం. సత్యం సత్యంగా చెప్పడం. "నిజయతిగా"- 'నిజయతిగా' వుండడం!!! 

'కర్ర విరగకూడదు-పాము చావకూడదు'---అనే Diplomacy Theory విష ఛందస్సు సర్పపరిష్వంగాన్ని వదిలి, రాము విన్నవి, ముక్యంగా కన్నవి 
విన్నవించగా - అవి పుంఖానుపుంకంగా, శ్మాశానాల వంటి నిఘంటువులు దాటి, వ్యాకరనాలు అనే సంప్రదాయపు సంకెళ్ళు విడిచి, .......స్వచ్చంగా, నిజయతిగా ....అవి అద్భుతప్రపంచ  నిర్మాణం కోసం ...వడిగా , వడిగా .....రాము సున్నిత హృదయం నుండి ....అద్భుత సినిమా కళాఖండాలుగా వెలువడ్డాయి, ఇంకా వెలువడ పోతున్నాయి .

ఎందుకు ఉపయోగం లేని మనలాంటి భాతుల మద్య ....పొరపాటున "రామ్ గోపాల్ వర్మ" అనే అద్భుత రాజహంస వచ్చి చేరింది. అసూయతో నానా యాగి చేయకండి. మన  ఆనందానికి, అదృష్టానికి పొంగిపోదాం.
Let’s celebrate for His Visual Treats.

వేయి సంత్సరాలు తపస్సు చేసినా-సాదించలేని స్థితప్రజ్ఞతని, పుణ్యఫలంతో ఆ స్థితప్రజ్ఞతని సాదించిన --ఒక గొప్ప ఋషి రామ్ గోపాల్ వర్మ.

రాము , స్వార్ధం లేని, ఆప్యాయతానురాగాలతో కూడిన గొప్ప ఆదర్శ ప్రపంచాన్ని డ్రీం చేస్తున్న---ఒక సృజనాత్మక కళాకారుడు.

ఈ  అందమైన ప్రకృతి , ఈ కపటత్వాన్ని, కుళ్ళుని , భరించ లేక,--తన నిజమైన అందాన్ని చూసే ప్రియుడిని, నిజాయతిపరుడిని కనాలని వేయి సంత్సరాలు తపస్సు చేస్తే -----రామ్ గోపాల్ వర్మ అనే అద్భుతం ఈ భూమి మీద Existence  లోకి వచ్చింది
1930 వరకు తెలుగు కవిత్వం నన్ను నడిపిస్తే , 1930 తర్వాత తెలుగు కవిత్వాన్ని నేను నడిపించాను అన్నాడు శ్రీ శ్రీ .

అట్లాగే , "శివ" సినిమాతో భారతీయ సినిమా రూపురేఖలను మార్చిన ప్రజ్ఞావంతుడు, చారిత్రిక సృజనాత్మక చైతన్య కళాకారుడు రామ్ గోపాల్ వర్మ.

అతను  జీవించిన కాలంలో జీవిస్తున్నందుకు గర్వపడదాం.  రాము నుంచి మరిన్ని అద్భుతాలు ఆశిస్తూ----

       
Srinivasa Raju, B.sc, M.A.(University Topper in Theatre Arts),M.C.J., M.Phil,(M.Phil & Ph.D Entrance’s first Ranker)
cell No :  0810 6871 802  ,  9985 269 139