నిర్భయ
నిర్భయ, ఏ బీభత్సం నీ ఉనికిని అదృశ్యం చేసిందో !?
నింగి కెగురుతూ నీవు రాల్చిన కన్నీటి చుక్కలు .........
నిప్పు కణికలై మా 'కుసంస్కారపు' - ముసుగులను -
ఇంకా కాల్చాయో లేదో తెలీదు!
కానీ - మహా సంద్రమై "యువత" నీ వెనుక నిలబడి పోరాడింది !
(కొడి గట్టిన దీపంలా ఉన్న "ఔన్నత్యపు వెన్నెల వెలుగుపై" ....చిన్ని ఆశ...)
నిర్భయ - సమిధగా నీవు చేసిన ఆత్మత్యాగం -
నిర్భయంగా నిద్రపోతున్న వ్యవస్థను నిద్రలేపిందా --?! "లేదా ......
"అయి శతఖండ విఖండిత రుండ వితుండిత శుండ గజాతిపతే-
రిపుగజగండ విదారనచండ పరాక్రమశుండ మృగాధిపతే -
నిజభుజదండ నిపాతితఖండ విపాతితముండ భటాధిపతే......."
అని ప్రతి "స్త్రీ" మహిషాసుర మర్దినై హోంకరించాలా ....???!!!"
..............
"కదిలేదీ , కదిలించేదీ ----
మారేదీ , మార్పించేదీ ------
................................
పెనునిద్దర వదిలించేదీ -----
పరిపూర్ణపు బ్రతుకిచ్చేదీ-------"
మహాకవి మంచి మాటల్లో జాతినిర్మానం కొనసాగాలి !
నిర్భయ నీముందు దోషుల్లా నిలబడ్డాం !
క్షమించమని అడగలేం ......!
కానీ "కళ్యాణి "----కళారూపంగా ---
అందుకో మా కన్నీటి నివాళి !
-------శ్రీనివాసరాజు.పి
11-01-2013
Cell No :- 0810 6871 802
E-Mail :- hellopsraju@gmail.com
Cell No :- 0810 6871 802
E-Mail :- hellopsraju@gmail.com
No comments:
Post a Comment