సముద్రం పై జీవితం
నువ్వు అబద్దం చెబుతావు,
నేను అబద్దం చెబుతాను ,
రెండు అబద్దాల మద్య
జీవిత సందేశాన్ని విన్పించాలనే
ఒక వృధా తాపత్రయం!
తెరచాప ఎత్తిన జీవితం
సముద్రపు ఆటుపోట్లకు
నిలబడుతుందో లేదో తెలీదు
అబద్దం 'తెడ్డు' తీరం దాటించదు అని తెలుసు
'నిజం' 'తెడ్డు' ను తాకాలంటే భయం !
అదింకా అలవాటు కాలేదు ,
కానీ ----
స్తబ్దుగా జీవితం కొనసాగుతోంది !
గాలివాన -తుఫాను హొరు రానంతవరకూ 'ఫర్వాలేదు'
వస్తే పడవలో జీవితం అగమ్యగోచరం!
................................
(March,2014)
E-Mail :hellopsraju@gmail.com
(Cell :- 0091 810 6871 802)
No comments:
Post a Comment