తొలి అడుగు అరుణాచలం వైపుకు
Who Am
“I”
"నేను" ఎవరు ?
జన్మ జన్మల నుంచి వేదన .....
(నేను అంటే ఎవరు? రక్త మాంసాలతో వున్న ఈ శరీరాన్నా ? ఆద్యంతాలు లేని అలోచనల పరంపరనా!? అనంత వేగంతో ప్రయాణించే మనసునా? నేను అంటే ఆత్మనా ? నేను అంటే..... "ఆత్మ", "శరీరం", "మనసు ".........లేదా ఇంకేదైనా వుందా? చూద్దాం...."."యాకుందేందు తుషార హార...." సరస్వతి కవితాక్షరమై.....ఆ అద్భుత సాధనలో ....,అభ్యాసంలో ..., ప్రయాణంలో ....తెలుసుకుందాం. .....)
-------------------
గత జన్మ స్మృతులను జ్ఞప్తికి తెప్పించే--
ఈ గాలి, మట్టి, దుమ్ము, బంగారపు ఇసుక--
నీలపు ఆకాశంవైపు చూస్తూ 'తాడిచెట్లు' - గంభీరంగా సముద్రంపైనుంచి వచ్చే హొరుగాలికి "ఊ " కొడుతూ స్వాగతం చెప్పే కొబ్బరిచెట్లు
'బోది'(పిల్లకాలువ) పక్క, ఆ కొంచం నీరే ఆహారంగా ఎన్నో తుప్పలు, ముళ్ళ పొదలు, పచ్చగడ్డి.....,విప్పపూల మత్తుతో పాడే ఈల పిట్టలు ,
హేమంత తుషారంలో మెరిసే తొలి సూర్యకిరణం ........
--------
ఇపుడు ఏదో ప్రాణంతో వున్నారు కనుక ,
అపడపుడూ మీ శరీరం నుండి, మీకు మీరు వేరుపడి
మిమ్మలను "మీరు" చూసుకునే - కొంచం తెలివి, సత్యదృష్టి
వున్న అదృష్టవంతులే ఐనా---
ఆ గొప్ప -'పరిశీలన'---
మిమ్మలను మీ భ్రమలనుంచి దూరం చేసేది కాదు!
.. మిమ్మలను మీరు ఏ.సి. గదుల్లో, నాలుగు గోడల మధ్య
బంధించుకుని -
గొప్ప గొప్ప భవన సముదాయాలు కట్టుకుని ,
కాంక్రీటు గోడల మధ్య ,......
"పిల్లలు, మనుమలు ......., అనే రక్తసంబంధపు మాయాజాలం మధ్య-
చిక్కుకుని ,
అదే శాశ్వతత్వం--
అనే భ్రమల్లో --ఆ భ్రమలే నిజం అనుకుని
మీకు మీరు , మిమ్మలను మీకు నిరంతరం గుర్తుకు తెచ్చుకుంటూ.....
"భౌతిక విషయాలతో --
"భౌతిక విషయాలతో --
తాదాత్మ్యత , ఐక్యం , ఏకీకరణం, ....., అద్వైతం , ......"
మాయలో కుట్టుకు పోతూ -----
చీకటిలో వెదుకులాట ....(కర్మయోగం లోనే , భక్తియోగం ,....,జ్ఞానయోగం......),
ఆ భవబంధాలలోనే,(తాము తమ పిల్లలు బాగుంటే చాలు అనే...) ఆ స్వార్ధపు భ్రమలలోనే వెదుకులాట !!!
ఎంత ఆశ్చర్యం !
--------
ప్రకృతిని చూస్తే పరవశం ఎంత రాక్షసుడికైనా సరే-ఎంతో కొంత !
ఎందుకంటే, నిన్ను నీవు వెదుక్కునే "తొలి అడుగు" అది.
"నిన్ను" నీవు తెలుసుకో -
అని ప్రకృతి ప్రతీరోజూ ఏదో ఒక క్షణమైనా నిన్ను పలకరిస్తూనే వుంటుంది!
అది స్వేదంతో నీ నుదురు తడిచినపుడు, హాయి ఐన చల్లటి చిరుగాలి స్పర్శ కావొచ్చు, పచ్చదనంతో మెరిసే మైదానపు వెలుగు కావొచ్చు....
సముద్ర కెరటాలు, వెన్నల రాత్రులు, మల్లెపూల పరిమళం, సహచరి చిరునవ్వు....
ఏదో రకంగా ప్రకృతి నీ సంస్కారాన్ని నిరంతరం స్పృ శిoచడానికే ప్రయత్నిస్తుంది !
-----
కాని లక్షల జీవితాలు , లక్షల జీవితాలు
ఆ స్పర్శను అనుభూతి చెందకుండానే-
అనంతంలో కలిసిపోతున్నాయి .
అదృశ్యంలోకి అదృశ్యం ఐపొతున్నారు !!!
("సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వ సంభవం
విశ్వం నారాయణం దేవం అక్షరం పరమపదం "...
అనుభూతిలో అర్థం చేసుకోకుండానే అదృశ్యం ఐపోతున్నారు ......ఇక్కడ సహస్రం అంటే కేవలం వేయి అని కాదు, అనంతం అని అర్థం ....)
కాని వీళ్ళంతా నిజానికి ,
ఈ భూమిపై తాము శాశ్వతం అనే మిధ్యలో --
నా కూతురు , నా కొడుకు , నా భూమి , నా పొలం , నా చేపల చెరువులు ,
....నా దస్తావేజులు ......నా బంగారం, నా ఆస్థులు ...,
చేనుగట్టు గొడవలు .......
అహంకారాలు , ఆత్మవంచనలు , కపటత్వం ,....
బూటకపు పరువు మర్యాదల్లో....
ఐక్యం ఐపోయి, తలమునకలై పొయి , --స్వార్థంతో -అశాంతితో,
ఇరవయ్యేసి సంవత్సరాలను 20 క్షణాల్లా గడిపేసిన మూర్ఖులే వీరంతా!!
శాంతికి దూరం ఐ పోయిన - భాగ్యం వున్న నిర్భాగ్యులే వీరంతా !
నిజమైన ప్రేమను పొందలేక పోయిన అభాగ్యులు .......
(ఇందులో మీరున్నారా ???...)
-----
"ప్రతి మనిషి తనకు చావు లేదని , వున్నా ఇపుడిపుడే కాదులే ...."
అని నిరంతరం తనను తాను మోసం చేసుకుంటూ బ్రతుకుతుంటాడు.!!! ("తాను తప్ప, --,మిగతా ప్రపంచం మొత్తం చనిపోతుంది" అనే subconscious feeling లో majority ప్రజలు. మనుషుల్లోని బీభత్సమైన స్వార్ధానికి పునాది అక్కడే....)
--------
పదండి అరుణాచలం వైపుకు , (తిరువన్నామలై )
అరుణాచలం అంటే అంటే ప్రకృతి ,
ఈశ్వరుడు ప్రకృతి కి ప్రతిరూపంగా -(ఆ గిరీశ్వరుడుగా)-
"దూరంగా ధ్వనించే గుడిగంటల్లో , శిఖరo చుట్టూ మూగే మేఘాల నీడల్లో ....."(*)
తెల్లారగట్లా, లేదా సూర్యాస్తమయాల్లో మీరు చేసే గిరి ప్రదిక్షిణాల్లో---"అరుణాచల శివ , అరుణాచల శివ , అరుణాచల శివ , అరుణాచలా....." అనే భక్తుల పారవశ్యంలో --ఏదోఒక రూపంలో అరుణాచలేశ్వరుని స్పర్శ మీకు తగులుతుంది !
జన్మ ధన్యం ! మహద్భాగ్యం !!
------
గొప్ప సంస్కారంతో నిన్ను నీవు తెలుసుకోవడానికి
తొలి అడుగు అది.
అరుణాచలంలో అడుగు పెట్టావంటే
ఆత్మ సౌందర్యం వైపుకు తొలి అడుగు వేసినట్టే!
---------
"....... రమణమహర్షి".....
"నేను" ఎవరు ? జన్మ జన్మల నుంచి వేదన ....
దాన్ని చేదించే, శోధించే సాధన వైపుకు తొలి అడుగు అరుణాచలం !!
ఒక ప్రక్రియ, ఒక అభ్యాసం , ఒక క్రియా యోగం....
------శ్రీనివాస రాజు .పి
Cell No :- 810 6871 802
Cell No :- 810 6871 802
05-04-2007
(పుణ్య భూమి - భారతదేశం లో ఎన్నో పవిత్ర పుణ్య క్షేత్రాలు....అన్ని అపురూపమే. "శివాయ విష్ణురూపాయ ........" అని నమ్ముతూ - ధర్మ రక్షణకై (గోవు ,గీత, గోపురం,గంగ, గురువు ....రక్షణకై....)....ఆధ్యాత్మిక ప్రవచనాలతో....ప్రజలను చైతన్యవంతులను చేస్తున్న, చేసిన ,.....(నిజమైన సాధనతో, నిస్వార్ధంతో పనిచేస్తున్న) సత్యవంతమైన యతీశ్వరులందరికి ఈ జ్ఞానాక్షరాలు అంకితం. అదే యతీశ్వర రక్తం నాలో ప్రవహిస్తోంది. ఆదిశక్తి అమృత హస్త స్పర్శతో పునీతమైన నా జన్మ,....,నా ద్వారా ఈ భూమిపై ఆమె నిర్వర్తించే కర్తవ్యం....."చైతన్య సందేశం". శాంతి, ప్రేమ,..,సేవ,.... క్షమ, ...., పరమత సహనాన్ని భోదిస్తూ,....నిజమైన ఒక ".....ప్రక్రియ" తో , ఆధ్యాత్మిక సాధన ఆవిష్కరణ....... )
No comments:
Post a Comment