DIVINE LOVE
ప్రేమ
రైతు కష్టాన్ని చూడని ప్రేమ ఒక ప్రేమేనా ?
పశుపక్షాదులను ప్రేమించని ప్రేమ ఒక ప్రేమేనా?
వర్షం చినుకు అందాన్ని గమనించని ప్రేమ ఒక ప్రేమేనా?!
కార్మికుడి కష్టానికి స్పందించని ప్రేమ ఒక ప్రేమేనా?
నది అందాన్ని, సముద్ర కెరటాన్ని, మేఘం మెరుపుని.....
గుర్తించని ప్రేమ ఒక ప్రేమేనా ?
అనంత విశ్వాన్నే కాదు, భూగోళంపై వున్న పర్వతాల వంపు,
ఆ పచ్చిక మైదానాల వెలుగు, ఎవరెస్ట్ మంచు....., అన్నిటినీ ప్రేమ వీక్షిస్తుంది !
నిశ్శబ్దం లోని శబ్దం ,
శబ్దం లోని నిశ్శబ్దం .....
అన్నిటినీ వింటుంది.
ప్రేమ ఒక నిజాయితీ ,
ప్రేమ ఒక నమ్మకం,
ప్రేమ ఒక సత్యం,
ప్రేమ ఒక భరోసా ,
ప్రేమ ఒక నిరంతర సంభాషణ,
ప్రేమ ఒక మౌనం,
(ఈ మౌనమూ మాట్లాడుతుంది)
ప్రేమ ఒక అభ్యాసం !
ప్రేమ ఒక ఆత్మ అన్వేషణ.
నిజమైన ప్రేమ నిన్ను మనిషిలా ఎదిగేలా చేస్తుంది.
సంకుచితత్వం వైపుకు, చీకటి వైపుకు, స్వార్ధం వైపుకు, ---DIVINE LOVE నడిపించదు.
-------------------------*************------------------
ON THE CONTRARY :-
ఒక మనిషిని మలినత్వం వైపుకు,
అజ్ఞానం వైపుకు, ఒక బలహీన వ్యసనం వైపుకు,
(అది అతడు నేర్పిన క్షుద్ర శృంగారం ఐనా కావొచ్చు),
ఆ స్త్రీని మానసిక బలహీనురాలిగాను, (వ్యభిచారినిగానూ కూడా), వ్యసన పరురాలిగానూ, ఆందోళనా మనస్కురాలిగానూ,
ఒక నిర్లక్షపు తెగింపు మనిషి గానూ ,
జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకునే మనిషిగానూ---
(IN SOME CASES....మంచి మనిషినీ, మంచి మాటను, ప్రతీ విషయాన్నీ అనుమానించే .....ఒక అనుమానపు దెయ్యం గానూ...మారి, ఇక BALANCE LIFE ని MISERABLE గా గడిపే జడ పదార్దం గానూ కొందరు స్త్రీలు మారవచ్చు.మారుతున్నారు. మితి మీరిన అతి జాగ్రర్త వల్ల జరిగే ప్రమాదం ఇది)
తన అపురూపత్వాన్ని గుర్తించని మనిషిగానూ--చేస్తుంది....
చేస్తుంది ........
"ఒక దుర్మార్గుడి చీకటి క్షుద్ర హింసా రాక్షస శృంగారం".
(ఆ క్షుద్ర స్వార్ధపరుడి రాక్షస శృంగారం ఆ మంచి స్త్రీని, ఇట్లా మారుస్తుంది, ఇట్లా చేస్తుంది)
ఆ క్షుద్ర మానసిక రాక్షస దాస్య శృంఖలాల నుంచి
ఆ "స్త్రీ" బయట పడి ---
"దేవతా స్త్రీ" గా మారితే (అలా విజయం సాదిస్తే --)
అది నిజంగా అద్భుతం!
ఆమె ఎందరో స్త్రీలకు ఆదర్శమూర్తిగా నిలుస్తుంది!
(అపుడు నిజమైన ప్రేమ ఆమెని వరిస్తుంది. నిజం పునాది మీదే కదా, నిజమైన ప్రేమ .. నిలబడేది)
----శ్రీనివాస రాజు .పి
2013
No comments:
Post a Comment