స్నేహం
నువ్వొక మనిషివి
నేనొక మనిషిని
మనిద్దరి మధ్య మాటల వారధి !
ఆప్యాయత అనే ఇనుము తో
అనురాగం అనే బలంతో .....
వారధిని వృద్ధి చేసుకోవాలంటే ---
ఇద్దరి సహకారం అవసరమే మరి !
నీ జీవితానుభవాలు నీకుంటాయి
నా జీవితానుభవాలు నాకూ ఉంటాయి !
నీకై ఓ "జీవితకాలం", అదెంతో రహస్యం
నా కొరకూ ఓ "జీవిత కాలం" , అదీ రహస్యమే !
జీవితంలో ఓ భాగం
మనం సమకాలీనులమవ్వడం యాదృచ్చికమే సుమా !
ఒక "పొద్దు"-- అటు -- ఇటుగా మనం జన్మించినా ,
మన 'కాంటెంపరరీ', మన 'సాహచర్యం',
నిజంగానే యాక్సిడెంటల్ !
"ఎంతగా ఎడం ఎడంగా వున్నా,
ఎంతగా పై పై భేదాలున్నా ,
అంతరంగం అట్టడుగున మాత్రం అంతమందిమీ మానువులమే --"
అనలేదూ మహాకవి !
అందుకే
మన సంబందాన్ని , స్నేహాన్ని ----తీయగా వుంచుకోడానికే ప్రయత్నిద్దాం !
------- శ్రీనివాస రాజు .పి
14-11-1997
___________________***************______________________
నన్ను దగ్గరగా ఎరిగిన మిత్రులకు ,
ముఖ్యంగా ---మురళి, రవి, ----క్రాంతిలకు ---ఇంక ఎందరో స్నేహితులకు
(ఈ poem క్రాంతి కుమార్ కు ప్రత్యే కంగా -----అతని ఆత్మీయతను మరువలేం . అతను ఈ రోజు మామధ్య లేడు )
No comments:
Post a Comment