శ్రీనివాస రాజు
ఒక ప్రవాహం,
ఒక సముద్రం,
ఒక అడవి,
తుఫాను హొరు,
సముద్ర గర్జన,
ఒక ఇంద్ర ధనస్సు,
ఒక వానచినుకు!
శరత్కాలపు వెన్నెల!
ఒక వానచినుకు!
శరత్కాలపు వెన్నెల!
ఒక చిరునవ్వు , పసిపాప ఆశ్చర్యం ,
చెట్ల గుబురులో ఆడుకుంటున్న తొలి సూర్య కిరణం,
తల్లి పాలకై పరిగెడుతున్న లేగదూడ గెంతు,
"చీకటి ఆకాశంలో -
నక్షత్రాల గుంపు వెనుక ఊహ కందని పాలపుంతల ఆశ్చర్యం !"
నక్షత్రాల గుంపు వెనుక ఊహ కందని పాలపుంతల ఆశ్చర్యం !"
నెమలి నాట్యం, మానస సరోవరం వదిలి వచ్చిన ".......",
పిచ్చుక గూడు మర్మం, పాలపిట్ట సొగసు,
తల్లి ప్రేమ విశ్వవ్యా పితమవ్వాలని కోరుకొనే ఒక స్వాప్నికుడు!
ఈ రోజుకీ " సూక్ష్మ శరీరంతో" విశ్వమంతా విహరిస్తున్న ఒక రహస్యం శ్రీనివాస రాజు
అతనో అద్బుతం, మిరాకిల్ !
"వెన్నెల రాత్రి, గోదావరి నది, థేమ్స్ నది, నైలు నది, ....,అమజాన్ నది, మిస్సిస్సిపి , చాంగ్ జియాంగ్ , ఓబ్ నది , పారానా, జైరే నదీ పరివాహక ప్రాంతాలలో ...విహరించి .ఆ ..సౌందర్యాన్ని కళ్ళల్లో నింపుకున్న....గంధర్వ పురుషుడు." (అందుకే అర్ధరాత్రి దేవతలు వచ్చి ....అతన్ని ....తమలోకంలో తమతో విహరింప చేసుకుంటారు. అందుకే కదా, అతని బుగ్గల్లో ఎరుపు, కళ్ళల్లో మెరుపు ), మరియు , స్వప్నాలకు సౌందర్య నగిషీలు చేక్కుకున్నవాడు,........
మీ స్వార్ధపు డిప్లమసీని పరిహసిస్తాడు
అతని సహజపు నిజాయతీ,--మీ చీకటి కోణాలను,
DOUBLE STANDARDS ను, మీ మోసాన్ని, స్వార్ధాన్ని, నటనను,
HYPOCRISY ని,
DIRECT గా EXPOSE చేస్తుంది.
అర్థం చేసుకుంటే అతని సాహచర్యం ఓ మానవీయ స్పర్స. (అది మిమ్మలను సహజత్వం వైపుకు, సౌందర్యం వైపుకు నడిపిస్తుంది).
అతని సాహచర్యం- హేమంత తుషారం, మలయ మారుతం.
పక్షుల గుంపు, వెన్నెల వెలుగు!
నీరెండ కాంతి! చేపపిల్ల సొగసు!
పచ్చిక మైదానం! ప్రియురాలితో రైలు ప్రయాణం!
ఆకలి రుచి! నుదుటి స్వేదాన్ని ముద్దు పెట్టె చల్లటి చిరుగాలి స్పర్స!
"కష్టించిన రైతు, చెమట చిందించిన కార్మికుడు....సాయంత్రం ఇంటికొచ్చాక....చేసే(చేయగల్గితే) గోరువెచ్చటి నీటి స్నానం,
అతను తినే(తినగల్గితే) పప్పు, ఆవకాయ, వెన్నపూస, పెరుగు భోజనం రుచి ని నేను."
ఆకుమడి, కుప్పనూర్పు, పచ్చగడ్డి, తాడిచెట్లు ,కొబ్బరి చెట్లు, పిల్ల కాలువ, కొల్లేరు సరస్సు, మానేరు వాగు, తెలంగాణా పిలుపు, గోదావరి యాస, దేవదారు వృక్షపు గాంబీర్యం, పసిపిల్లాడి కేరింత, ....,చిన్నిపాప అమాయకత్వం...,అర్జునుడి ధీరత్వం, (నిజమైన మంచి మనుషులకు దయాగుణంలో కర్ణుడు),
శ్రీశైలం కొండల, తూర్పు కనుమల తుళ్ళింత,
పాపికొండలు , కొల్లూరు గ్రామ నిశ్శబ్దం,
అరేబియన్, మధ్య ప్రాశ్చ ఎడారి ...ఒంటెల అనుభవం-
కోన సీమ సౌందర్యం, ఎదుర్లంక, డి-గన్నవరం గోదావరి ఇసుక తిన్నెలు మరియు తమల పాకుల తోటలు, దిండి గోదావరి, రావుల పాలెం అరటిగెలలు, అవిడి అరటి తోటలు---
నాకు తాత్విక బోధనలు చేసిన చేబ్రోలు, భీమడోలు జాతీయ రహదారి---
షేక్స్పియర్ ఘాడత(నాటకీయత ), షెల్లీ భావుకత, కీట్స్ ప్రేమతత్వం,
టాగోర్ భక్తి,
"జగద్గురువు ఆది శంకరా చార్యుని కవిత్వం,
'నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం...'..."
రామనుజాచార్యుని విశిష్టత-
శ్రిమద్వాచార్యుల ద్వైతం, కృష్ణ తత్త్వం,
వివేకనందుని నీర్భీతి, రామకృష్ణ పరమ హంస చైతన్యం, జీసస్ క్షమ, అల్లా దయ,
అన్ని మతాలను ప్రేమేంచే సున్నితత్వం,
అందరు బావుండాలని కోరుకునే ప్రేమ,
అడవులను చెట్లను, నదీనదాలను, ప్రకృతిని ప్రేమించే మనసు-
జోసెఫ్ కాంప్బెల్, క్రిస్టోఫర్ వోల్గర్, సిడ్ ఫీల్డ్ , ...చలం, రజనీష్, అయాన్ ర్యాండ్ ,....శామ్యూల్ బెకెట్ , బ్రేక్ట్, కాళిదాసు, పోతన, వేమన, గురజాడ, STANISLAVSKY, భరతముని, .....AKIRA KUROSAWA.....ఇంకెందరో అతని రక్తంలో!
నిరంతరాన్వేషి నిశ్శబ్దమూ మీకో అనుభవమే!
అతని సమక్షంలో ....అతను సృష్టించ బోయే...
ఆస్వాదించండి అతని సాహచర్యాన్ని, ప్రయాణాన్ని!!!
---- శ్రీనివాస రాజు.పి
(Cell No :- 0091 810 6871 802)(E-mail :- hellopsraju@gmail.com)
(Cell No :- 0091 810 6871 802)(E-mail :- hellopsraju@gmail.com)
-------16-10-2012
(మిత్రులారా, ప్రతి మనిషి ఒక అద్భుతం,.....,కొందరి లో , దైవాంశ, లేదా కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉండవచ్చు. ..,....కాని, సంస్కారం తో, సాధన తో, ఏకలవ్యుని అంత క్రమశిక్షణతో.....,హార్డ్ వర్క్ తో.....అ శక్తి మరింత ద్విగుణీ కృత మవుతుంది, అతని తో అద్భుతాలు సృష్టించబడతాయి. ---శ్రీనివాస రాజు.పి )
No comments:
Post a Comment