మీరు అంటే
ఆశ్చర్యం " మీరు" అంటే మనిషి అస్తిత్వ వైయక్తిక తాత్విక పునాదులు కుడులుతాయ?
ఒక్కడిగా వచ్చి,
ఒక్కడిగా వెళ్ళడం నిజమే!
నీ వైయక్తిక సాధనను సమూహం పై రుద్దుతానంటే ఎట్లా?
ఒక్కడివే నిజం, కాని
రెండు శరీరాల అద్వైత అనుభవం నీ సంభవం !
నిటాలేక్షనుడి సమక్షానికి నిన్ను చేర్చడానికి నాలుగు భుజాల సాయం అవసరం అని మర్చిపోయావా?
నిష్కల్మషమైన ప్రేమను పొందే, ఇచ్చే సహచరి వుంటే ఆమె తో నువ్వు , నీతో ఆమె --పిలుపులు ప్రదానం కాదు!
ఆత్మ సాన్నిహిత్యమే ప్రధానం అక్కడ!
కాని సామాజిక స్వేఛ్చ వేరు, వైయక్తిక స్వేఛ్చ వేరు మిత్రమా!
కొత్త మనుషులకు, కొత్త స్నేహాలకు "నువ్వు" అంటూ మొరుటుగా ఆహ్హానం పలుకుతానంటే ఎట్లా?
ఔవన్నత్యాల అంతరం చైతన్యాల అంతరం వున్నపుడు
'ఏకవచనంలో' పిలుపు ఆహ్హనిన్చదగినది అంటావా మిత్రమా?
సాన్నిహిత్యం చిన్నదైనపుడు , గౌరవ వాచకం ఎదుటి వారి హృదయం తలుపులుల పై ప్రేమ జల్లు కురిపిస్తుంది.
ఆంగ్ల భాష కు లేని సౌలబ్యం , తెలుగు భాషకు వున్నా సున్నితత్వం గౌరవ వాచకం "మీరు" అనేది!
"తండ్రి ని , గురువునీ ........" కూడా నువ్వు అని ఏకవచనం తో పిలుస్తానంటే ఎలా మిత్రమా?
అసహజపు బహువచనాలు , అసహజపు గౌరవ వాచకాలు , ఆడంబరపు భుజకీర్తులను తిరస్కరిద్దాం!
కొంచం ఆలోచించు కొప్పర్తి నేస్తమా!
-----05 -03 -2012
05 - 03 -2012 వివిధ "ఆంధ్రజ్యోతి" లో 'కొప్పర్తి' రాసిన 'ఒక నిరాకరణ' అనే కవితకు ప్రతిస్పందన గా---
No comments:
Post a Comment