దేశమంటే .....,
దేశమంటే "మనుషులు ఐతే" .....
కొందరు మనుషులు......
దేశమంటే "మనుషులు ఐతే" .....
కొందరు మనుషులు......
నా దేశంలో నదుల గర్భాలు ,
'భూగర్భ జలం' అనే పవిత్ర పసిపిల్లల చిరునవ్వులను రూపాంతరం చేసే
బంగారు ఇసుకను,
కటికవాడు 'పవిత్ర గోవును' వధ చేసినట్టు ----
నది వడిలోంచి 'ఇసుక గర్భాన్ని ',
గర్భంలో ఆడపిల్లను భ్రుణ హత్య చేసినట్టు,
తెగనరికి, బజారు లో తన లాభం కోసం ,
"సరుకు " గా అమ్మేస్తున్నారు . ----"ఎంత పాపం?"
------------
దేశమంటే మట్టికూడా నోఇ ......
ప్రాకృతిక సౌందర్యం , ఈ దేశ కొండలు, అడవులు,
అగ్ని దాగిన పర్వతాలు , అన్నం దాగిన అడవులు,
ఐరన్ ఒర్ దాగిన గనులు , .......
అన్ని అక్రమంగా తరిలిపోతున్నై !
ఈ దేశ మనుషులే తరలించేస్తున్నారు.
బంగారం దాగిన నా దేశ మట్టిని దోచేస్తున్నారు!
నా దేశ మనుషులే, నా దేశ మట్టిని సరుకు గా వాళ్ళ లాభం కోసం, వాళ్ళ సౌఖ్యం కోసం...వాళ్ళ పిచ్చి విలాసాల కోసం
......అమ్మేస్తున్నారు.
దేశం పై విష సంస్కృతిని గుమ్మరిస్తున్నారు.
ఎవరు వారు? వారా? నా దేశమంటే?
"దేశమంటే మనుషులు" అని , ఆ మనుషులును నా దేశంగా చూడనా?
------------------
వద్దు, దేశమంటే మనుషులు అయితే , ఆ మనుషులు నాకు వద్దు.
నాకు ఈ దేశ మట్టి కావలి.
దేశమంటే "మట్టి " అని నిర్వచించుకొని ,
ఆ మట్టిని , ప్రకృతిని , భవిష్యత్ తరాల కోసం కాపాడుకుంటాను.
ఈ దేశ నదులు, నదుల్లో ఇసుక , నీరు, పొలాలు , జలపాతాలు, అడవులు, కొండలు, గనులు, తోటలు , వాగులు, వంకలు,..........సముద్ర ప్రాంతాలు ......అన్నిటిని కాపాడుకుంటాను. , (కాపాడుకోవాలి!!!???)
దేశమంటే మట్టికూడా నొఇ అని ఎలుగెత్తి పాడుకుంటాను.
------------------
----------శ్రీనివాస రాజు.పి
30 -01 -2012 (అర్థరాత్రి)
(గురజాడ, గాంధీ లకు, మరియు ప్రకృతి ప్రేమికులకు , కృతజ్ఞతలు )
No comments:
Post a Comment