యువతీ ....!
యువతీ !
యువతీ !
ఓ నా ప్రియమైన కలలమైత్రీ
అర్ధరాత్రి అకస్మాత్తుగా నీ జ్ఞాపకం నన్ను కలవరపెడుతుంది!
అనుకోని నీ ఊహ నాలో 'రెప రెప ' లాడుతుంది !
నా ఆలోచన ఏ సమస్యావలయంలో పరిభ్రమిస్తున్నా సరే----
నీ అందమైన రూపం నా వేడిమనస్సుపై చల్లటి పన్నీటి జల్లుని కురిపిస్తుంది !
యువతీ !
ఓ నా ప్రియమైన కలలమైత్రీ ---
'జీవితం' ఎంత గొప్పది అన్న స్పృహ నాలో,
నీ కళ్ళ లోతులను చూస్తున్నప్పుడు మాత్రమే-----
ఆ స్పృహ జీవంతో, సజీవంతో కదుల్తుంది సుమా!
యువతీ !
ఓ నా ప్రియమైన ఆలోచనల మైత్రీ -
నీ అందం , ఔన్నత్యమే ---
నన్ను జీవంతో, నవతెజంతో-ప్రేరేపిస్తూ--
ముందుకు కదిలిస్తోంది అన్న నేటి నా 'బలహీనత' నీకు తెలుసా?
ఎలా బంధీ అయ్యాను నీకు అంటే సమాధానం నావద్ద లేదు!
యువతీ !
ఓ నా ప్రియమైన కళల మైత్రీ !
నీ "చిరునవ్వు" మెరుపు చూసి - నేను తాదాత్మ్యత చెందుతాను!
నీ కళ్ళ కాంతులను చూసి మైమరుపుతో ----
ఆహా ! ప్రకృతి ఎంత అందం అని అచ్చెరువొందుతాను !
యువతీ !
ఓ నా ప్రియమైన జీవిత సహచరీ ,
నీ సమక్షంలో -----
నీ సౌందర్యం సాక్షిగా ,
నాలో ఓ సవ్యమైన మార్పు ! ఏదో సాదించాలనే ఒక తహ తహ
అవ్యక్తమైన ఓ ఇన్స్పిరేషన్ ......
నాలో విద్యుత్ తరంగాల్లా ప్రవహిస్తాయి !
ఇదంతా -----
ఏ అద్భుత సృష్టిలో భాగం
అనే తలంపుతో ---
ఇద్దరం---
ఔన్నత్యపూరితమైన ఓ గొప్ప చిరునవ్వులో ఐక్యం ఐ ,
తాదాత్మ్యత చెంది,
చెలీ, మన ఆనందాన్ని వ్యక్తం చేయాలనుకునే ,
ఆ భావాన్ని అక్షరాల్లో-----
ఒక భాషలో వ్యక్తం చేయగలనా?
యువతీ!
ఓ నా ప్రియమైన కలల మైత్రీ ----
"నీ చిలిపి చిరునవ్వు , నన్ను కదిలించే నీ బంగారపు మేని హొయలు "
ఎలా వర్ణించగలను చెప్పు?!
భావాన్నైతే అనుభవించగలను గాని,
నా చిన్ని 'తెలివి' తో ------
అనంతమైన నిన్ను మాటల్లో వ్యక్తం చేయగలనా?
నాలో చెలరేగే---భావోద్వేగాల వెల్లువకు ----
ప్రాణం నువ్వు!
గానం నువ్వు!!
కేంద్రం నువ్వు !!!
నాలో ముసురుకొనే ఊహాకేరాటాల ఉప్పెనకు ఊపిరి నీవు !
నిన్ను గౌరవిస్తాను ! ఆరాధిస్తాను ! ప్రాణంలా ప్రేమిస్తాను!
కృతజ్ఞత ఎలా చూపగలనా అని శతకోటి మార్గాలను అన్వేషిస్తాను !
అంతేకాని --
నాపై నీ ప్రభావాన్ని మాత్రం
పూర్తిగా అభివ్యక్తం చేయలేను!
అది నిజం!
---------- శ్రీనివాసరాజు.పి
04 -04 -1996
Cell No :- 810 6871 802
No comments:
Post a Comment