"భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పిదుకుచున్నారు మూతులు బిగియగట్టి "
-------- చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు
1907 ఏప్రిల్ నెలలో రాజమండ్రి లో బిపిన్ చంద్రపాల్ సభ లో , చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు ఈ పై పద్యాన్ని మొదటి సారి చదివారు. ఇది చిలకమర్తి గారు రాసిన పద్యమే. (ఈ పద్యాన్ని చెన్నాప్రగడ భానుముర్తిగారు రాసారు అనే ఒక వాదం వుంది. కాని అది పూర్తిగా సత్య దూరం అని నా పూర్తి విశ్వాసం.). పాల్ గారి ఇంగ్లీష్ ఉపన్యాసాలను చిలకమర్తి గారు, తెలుగులో చెప్పేవారు. ఆరోజు సభలో , ఈ పద్యానికి ఒన్సుమోరెలు ...చాలా పడ్డాయంట.
"భరత ఖండంబు చక్కని పాడియావు
భారతదేశ ప్రజలు లేగేదూదలై ఏడ్చుచుండ
నేటి రాజకీయనాయకులు, ఇంకొందరు దుర్మార్గపు వ్యాపారవేత్తలు, మరికొందరు స్వార్ధ పరులు ........
పిదుకుచున్నారు మూతులు బిగియగట్టి"
-----శ్రీనివాస రాజు .పి
20 -03 -2012
-------------నేటి వ్యవస్థకు, చిలకమర్తి గారి పద్యం , కొంచం మార్చి రాసాను.(వ్యాకరణం లో వొదుకుతుందా నేటి దేశ అవినీతి, ...విలువలు, క్రమశిక్షన లేని,....., చాలామంది ప్రజల స్వార్ధం.......!!!???, "దూరేవి దొమ్మరి గుడిసెలు చెప్పేవి శ్రీరంగనీతులు...." అని ఒకరి గురించి ఒకరు వాళ్ళు చెప్పుకునేది చాల నిజం. "దొరికితేనే దొంగలు లేకపోతె దొరలు" కదా అని నమ్మి, దొరకనంత సేపూ, తమ అంత నీతివంతులు లేనట్టు మాట్లాడుతున్నారు. కొంచం డబ్బు సంపాదిస్తే,....డబ్బుని చూసి గర్వం. నేను ఏమి చెప్పినా చెల్లుతుంది అనే అహం రాజ్యమేలుతోంది. డబ్బుని చూసుకుని నాకు అంతా తెలుసు అనే దురహంకారం. ఈ డబ్బు పక్కన కొంచం రాజకీయ అధికారం కూడా తోడైతే, ఇక పిచ్చికోతికి కొబ్బరి కాయ దొరికినట్టే, వాళ్ళ ప్రవర్తన వెర్రితలలు వేస్తుంది. సమాజంతో ఆటలు మొదలుపెడున్నారు. . నిజమైన ప్రేమ, దయ, దాతృత్వం, కరుణ, ఆప్యాయత ,......,పక్క వాడి కష్టానికి నిజమైన కన్నీళ్లు కార్చే మానవీయ మనుషులును బూతద్దంలో పెట్టి వెదకాలి. జారిపడుతున్న మనిషికి సాయమందించే చేతులు కరువయ్యాయి. జారిపడుతున్న మనిషిని చూస్తే వాళ్ళకు ఒక నవ్వులాట, ఒక ఎకసక్కం, ఒక చోద్యం , ఒక వినోదం .....దాన్ని ఆనందించే ఒక శాడిజం! భయంకరమైన హిపోక్రసి లో , ఒక డొల్లలో .....,హేడోనిజంలో....నేటి సమాజం వుంది. ---శ్రీనివాసరాజు. పి , 20-03-12 )

No comments:
Post a Comment