కాలకంటీ, కాంతిమతీ......
"మాలినీ, హంసినీ , మాతా మలయాచల వాసినీ....."
"తెజోవతీ, త్రినయనా, లోలాక్షీ, కామరూపిణీ.....
స్త్రీని దైవంగా , శక్తి స్వరూపంగా పూజించిన వేధభూమిలో......
బాలికా బ్రూణ హత్యలా.....?!
అబ్బాయి ---ఇష్టం (లాభం!)
అమ్మాయి పుడితే నష్టం , కష్టం!
అంచనాలు అమాయకం అందమా?!
అందనంత అనంతాన్ని అందుకునే అంతులేని స్వార్ధం వైపుకు
అజ్ఞానంతో, అవివేకంతో వేసే అర్ధవిహీన అడుగులు అందామా ?
"స్త్రీ " ప్రేమ లలిత్యానికి , అవున్నత్యానికి
ఆహ్వాన్నం పలకలేకలేకపోతున్న ........
"స్త్రీ" ప్రేమ లాలిత్యాన్ని ,అవున్నత్యాన్ని
దూరం నుంచి కూడా పొందలేకపోతున్న మనం --
అనర్హులమై వున్నాము ----నిజమైన ప్రేమకు,
అనర్హులమై వున్నాము ----"స్త్రీ" కళ్ళల్లోని మెరుపుని చూసేందుకు,
అనర్హులమై వున్నాము ----"స్త్రీ" ప్రేమను పొంది జీవితాన్ని వెలిగించికోనేందుకు !
బాలికా బ్రూనహత్యలతో ఇంకా కొత్త పాపాలా!!!???
"మొత్తం ప్రపంచాన్నే స్త్రీఈకరిస్తేనే గాని , లేదు సాంత్వన, లేదు విముక్తి, లేదు అభివృద్ధి " అని
అంటున్నారే కొందరు వేదికలపై !
మరి స్త్రీ శిశువును గర్భంలోనే చంపేస్తున్నాం?
ఎన్ని జన్మలేత్తితే 'కూతురు' ప్రేమను మీరు మళ్లీ పొందగలరు?
ప్రకృతికి ప్రతిరూపం ---"స్త్రీ" .
ఆమె సున్నితత్వం , దయ, దాతృత్వం, అవుదార్యం, ప్రేమ ,జాలి, కరుణ, .......
జీవరాసులన్నిటిని ప్రేమించే స్త్రీ గొప్ప మనసు,
పచ్చదనంపై మెరిసే హేమంత తుషారం అంటే అర్ధం కాదు.
పచ్చదనం పై మెరిసే హేమంత మంచుబిందువును చూసి మురిసిపోయే
"స్త్రీ" స్వచ్చమైన మనసు--
దుర్మార్గుడి కొంచం ప్రేమకు కూడా లొంగిపోయే ఆమె అవుదార్యం .....
(దీనిని బలహీనత అనొద్దు, అనుకోవద్దు , అది ప్రకృతి దయ, క్షమాగుణం, గొప్పదనం, బెనవలేన్స్ ...)
తల్లిగా నిన్ను నిలబెట్టింది!
యవ్వనం నుంచి, ఇంకో "స్త్రీ" ప్రేమ నిన్ను ఆదుకోవాలి.
..............డోంట్ డిస్టర్బ్ ఈకోలోజి !
నేటి యువత, రేపటి యువత
ఆ ఆదుకునే హస్తం కోసం యుద్దాలు చేయాల్సిన పరిస్తితి రూబోతోంది .
అమ్మాయి పుట్ట బోతోంది ,
"ఫ్రమ్ ది రష్టుసిటీ ఆఫ్ విల్లెజేస్ టు ది గ్లిట్జ్ ఆఫ్ మెట్రోపోలిస్".......
"....గర్భంలో ఆడపిల్ల....", లెట్స్ సెలెబ్రేట్ .
వింధ్యాచల నివాసినీ ,
పంచబ్రహ్మ స్వరూపిణీ,...
మీ కుటుంబంపై యుగయుగాల నాటి ప్రేమామృతం కురవబోతోంది ......
"ఆడపిల్ల పుడుతోంది !"
ప్రేమ లాలిత్యానికి, అవున్నత్యానికి ఆహ్వానం పలకండి !
మురిసిపోవాల్సిన గొప్ప అదృష్టం అది.
అమాయక బాలికాబ్రూనహత్యలు .....గర్భంలోనే "స్త్రీ" శిశువుని చంపేయడం అంత ఆటవికం???!
"స్త్రీ" పవిత్ర పాదధూలిని , భక్తితో , ఆరాధనతో కల్లకద్దుకొని.........
జ్ఞాన ప్రచారంతో , చేసిన చేస్తున్న తప్పులను ,
పాపాలను కడుక్కునే ప్రయత్నం చేస్తామని మాటే ఇస్తూ -------
క్షమార్హం కాని తప్పులు, క్షమించమని అడిగేదేలా ??!!
"సుమిఖీ , నళినీ, .......,సురనయకా....
కాలకంటీ, కాంతిమతీ, క్షోభినీ , సూక్ష్మరూపినీ ......"
--------శ్రీనివాసరాజు .పి
14 -12 -2011
(మురళి & పద్మలకు మార్చ్ ఆరు ,2012 న పుట్టిన ఆడపిల్లకు ఈ పోఎం అంకితం)
No comments:
Post a Comment