ప్రియ నేస్తం
( ఎన్ ఇంటిమేట్ టాక్ విత్ క్రియేటర్ )
అస్తిపంజరాలకు మాంసంముద్దల తొడుగు తొడిగి
రక్తం నీళ్ళతో నింపి , చర్మం తోలు కప్పి -----
ఏ కుట్లు కుట్టి....
ఎలా ఈ బుడగలోకి ఊపిరి వూదావో ..!!!!!!
నీ అందమైన సృష్టి చూడ్డానికి
రెండు కళ్ళు- అవీ మాంసంముద్దలే !
మెదడులో ఏ రసాయనిక పదార్దం నింపావో కాని----
మెదడు ఫన్క్షనింగ్ జరగడానికి
ఏ రకమైన ఇంతేగ్రతేడ్ సర్క్యుత్యుస్ వాడవో ----
వాటిని నియంత్రించే రిమోట్ రహస్యం ఏమిటో ...?
గుండెను కదిలించే , మనసును ఉద్రేకింప చేసే ఆలోచనలు ఒక వైపు ---
శాంతిని , చల్లదనాన్ని కల్గింప చేసే మల్లపువ్వుల లాంటి సున్న్నితమైన పరిమలాలు ఇంకొకవైపు !
యవ్వనంలో
ఈ స్కేలేటన్ చేసే మాయలు నీకు తెలుసా?
ఒక యువకుడిగా నాకు తెలుసు ,
నేను అనుభవించాను , ఇంకా అనుభవిస్తున్నాను .
ఈ మాంసంముద్ద మాయలు నేను తిలకించాను .
ఏమి మెరుపులు? ఏమి ఉరుములు ? ఎన్ని వెన్నలలు? ఎన్ని వద్దికలు ......
నా సహచరి కళ్ళలో నిన్ను దర్శించి కృతజ్ఞతలు తెలిపాను .
ఈ శరీరం మట్టిలో కలిసిపోక తప్పదు.
10 సంవత్సరాలు 10 క్షణాల్లా గడిచిపోతున్నై.
జీవితం ఒక గొప్ప స్త్రీ సహచర్యంలో గడవడం అద్బుతమైన వరం!
మామూలు రోజువారీ మలినమైన కల్మషం "ప్రేమపై" పడకుండా కాపాడుకోవడం
"స్త్రీ-పురుషుల ధర్మం "
వారే జీవితాన్ని సార్ధకం చేసుకోగలరు. వారే ధన్యులు .
ప్రియనేస్తం (టూ క్రియటర్....)....
నా ప్రియ నేస్తాన్ని(ఆ అద్బుత స్త్రీ మూర్తిని ) , నా కోసం పుట్టిన , నా సహచరిణి ....
నాకు చూపించు. (ఆ అర్హత కోసం ఏమి చేయమన్నా, చేస్తాను. ఏ అబ్యాసం, ఏ వున్నత విలువలు ....అన్ని ఇంకా నేర్చుకుంటాను)
ఆమె మనసులో నాకు చోటు కావాలి.
కాదు మొత్తం మనసంతా నాకే కావాలి.
-----శ్రీనివాస రాజు .పి
(మొదట రాసిన తేది :- 09 -06 -2005 , కొంచం మార్పులు చేసిన తేది :- 20 -03 -12 )
No comments:
Post a Comment