అన్ని జన్మల తర్వాత..........
మెరిసే గులాబీలు,
మాట్లాడే మల్లెపూలు
పారే సెలయేరు,
వీచే చల్లగాలి.......
అందం జీవితం, ఆనందం ప్రవాహం -
లక్షణాలుగా గల లక్ష సౌందర్య ప్రతిరూపాలు .....
-------
వాటి జీవిత కాలాలు - ఒక్క రోజో, ఒక్క పూటో, లేదా ఒక్క రాత్రో....
-------
లోకం మీదకు సౌందర్యాన్ని వెదజల్లి రాత్రికి
రాలిపోయిన ఎర్రగులాబీ ......
రాత్రంతా సృష్టి సౌందర్యానికి , వేడి నిట్టూర్పులకు సాక్షులుగా మిగిలి
ఇంకా పరిమళంతోనే ఒక్క రాత్రికే ధన్యతతో అమరత్వాన్ని పొందుతున్న మల్లెపూలు.....
ఇలా లోక కళ్యాణం కోసం ,
ప్రకృతి సౌందర్యానికి తమ వంతు నగిషీలు చెక్కడంలో...
ఈ అందమైన, ఆనందాన్ని పంచే,
కర్తవ్య నిర్వహణలో నూటికి నూరుశాతం జీవిస్తున్న .......
ఎన్నో వెలుగులు, మెరుపులు , మరణం తర్వాత......
సృష్టికర్త పాదాలను స్పృశిస్తున్నాయి ,
సృష్టికర్త పాదాలను స్పృశిస్తున్నాయి !
గుండెను పిండేసే బాధతో ప్రశ్నిస్తున్నాయి !
"ఏమిటి మా జీవితం?
అందం, ఆనందం మేం అందిస్తున్నాం సరే!
కాని ఈ లోక సౌందర్యాన్ని, ఈ ఆనందాన్ని ----
మేం అనుభవించేది ఎప్పుడు అని !
ఆ అవకాశం, అదృష్టం, అర్హత మాకు ఎందుకు ప్రసాదించడం లేదు?
మేం చేసిన పాపం ఏమిటి ?" అని
ఈ అనంత కాల ప్రవాహంలో ,
కనీసం ఒక్కసారైనా లోక సౌందర్యాన్ని ఆనందించే,
తనివితీరా ఆస్వాదించే అదృష్టం తమకు కల్పించమని!
ఆ జన్మ జన్మల వేదన -కడుపు తరుక్కుపోయే విషాదం....
ఆ జన్మ జన్మల వేదన -కడుపు తరుక్కుపోయే విషాదం....
సృష్టికర్త వింటున్నాడు, ......వింటున్నాడు .......
ఇలా -------
కోట్ల సంవత్సరాలు గడిచాయి , కోటాను కోట్ల సంవత్సరాలు గడిచాయి !
వేదనా తరంగాల ఘోష ప్రవహిస్తూనే వుంది.
------
ఆ వెలుగులు, మెరుపులు, (ఇక లాభం లేదు అనుకొని)
నవ్వుల పువ్వుల రారాజు గులాబీని,
తమందరి ప్రతినిధిగా, తమ తరపున ....
తమ జీవితాల గురించి సంభాషించడానికి .....
సృస్తికర్త దగ్గరకు పంపాయి
ఈ సంభాషణ, చర్చలు .......
ఇంకో కోటి సంవత్సరాలు జరిగాయి !
సృష్టికర్త అశ్రద్ద , బిజీ .....(ఆయన పనులు ఆయనకు వుంటాయి కదా మరి )
లేదా ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలీదా?!!
అనే ...............................................................
ఇలా కొన్ని యుగాలు గడిచాయి.
అప్పటికింకా మానవజాతి పుట్టలేదు .
----------
అన్ని యుగాల తర్వాత
సృష్టికర్త జాలిపడడం , ఆయనకు పై విషయం న్యాయం అనిపించడం ......
క్షణంలో కోటో వంతులో అన్నీఆలోచించడం జరిగాయి .
ఏ ముహూర్తం ఐనా , అది గొప్ప ముహూర్తం !!
విశ్వసృస్టిలో ఓ అద్భుతం జరగబోతోంది ,
కోట్ల నక్షత్రాలన్నీ ఆత్రుతతో ,
తమ కాంతిని సృష్టికర్త లలాటంపై నిలిపాయి !
మహాసముద్రాలు తమ ప్రళయ భీభత్సాన్ని ఒక్క క్షణం అపాయి !
సరే ఇన్ని జన్మల తర్వాత , ఇన్ని జన్మల తర్వాత.....
అని లెక్క చెప్పాడు.
----------
చెట్టుగా ఇన్నాళ్ళు,
చీమగా ఇన్నాళ్ళు,
రామచిలుకగా ఇన్నాళ్ళు ,
సాలెపురుగుగా ఇన్నాళ్ళు,
గువ్వపిట్టగా ఇన్నాళ్ళు,
సముద్ర జీవిగా ఇన్నాళ్ళు,
సరీశ్రూపంగా ఇన్నాళ్ళు,
కదిలే మేఘంగా ఇన్నాళ్ళు,
మెరిసే మెరుపుగా ఇన్నాళ్ళు,
వేచే గాలిగా ఇన్నాళ్ళు.......
......................................
శతసహస్ర జన్మలు ...............
---------------
"ప్రతిజన్మలోనూ మీ కర్తవ్యాన్ని మీరు
సవ్యంగా , సమగ్రంగా నిర్వర్తించాలి సుమా"....
అని హెచ్చరికలూ జారీ చేసాడు.
ఇన్నాళ్ళ , ఇన్నేళ్ళ మీ ఎదురుచూపులు తర్వాత......
నేను త్వరలో సృష్టించబోయే మానవజాతిలో ,
మిమ్మలను "స్త్రీ" లుగా పుట్టించబోతున్నాను అని
శుభవార్తను వాటి చెవిలో చెప్పాడు.
......."మధుమధురే మధుకైటభభంజని కైటభభంజని రాసరతే" -
......."శిఖరి శిరోమణి తుంగహిమాలయ శృంగనిజాలయ మధ్యగతే" -
......."త్రిభువనపోషిని శంకరతోషిని కిల్భిషమోషిని ఘోషరతే"-
......."నిజభుజదండనిపాతితఖండవిపాతితముండభటాధిపతే"--
అన్ని కోట్ల సంవత్సరాలు నిరీక్షన ఫలించిది! ...........జన్మ ధన్యం-మహద్భాగ్యం
అని కృతజ్ఞతలు.............చెప్పాయి సౌదర్య సుందరపుష్పాలన్నీ సృష్టికర్తకు,..ఆనందభాష్పాలతో ...,
స్త్రీ జన్మమీద ప్రేమతో .......
-----------
ఆ ధన్యత కోసం , అవి ప్రతిజన్మలోనూ తపస్సు చేస్తున్నాయి,
అవే కాదు ఇంకా ఎన్నో సౌందర్య ప్రకృతిప్రతిరూపాలెన్నో స్త్రీ జన్మ కోసం తపస్సు చేస్తున్నాయి!!!
అందుకే -------
శ్రద్దగా గమనించండి, చెరువు పక్క, చేను పక్క,
రహదారి పక్క , "స్త్రీ" జన్మ కోసం...... "స్త్రీ" జన్మ కోసం .....
"చెట్టు", అవును చెట్టు చేసే, మహావృక్షాలు చేసే ధర్మ తపస్సు మీకు కన్పిస్తుంది!
---------
అంత అద్భుతమైన "స్త్రీ" గా పుట్టడం కోసం ........
ఇంత అద్భుతమైన "స్త్రీ"గా పుట్టిన మీరు .........??!!
-శ్రీనివాసరాజు.పి
05 -04 -2007
(cell No :- 810 6871 802)
No comments:
Post a Comment